ponniyin selvan: చోళ యువరాజు గా విక్రమ్...పొన్నియన్ సెల్వన్ కొత్త పోస్టర్ రిలీజ్
04 July 2022, 13:13 IST
ఈ ఏడాది దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో పొన్నియన్ సెల్వన్ ( ponniyin selvan) ఒకటి. మణిరత్నం(maniratnam) దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదలచేశారు.
విక్రమ్
విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న చారిత్రక చిత్రం పొన్నియన్ సెల్వన్. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్(Aishwarya Rai Bachchan), విక్రమ్(vikram), కార్తి, జయం రవి(jayam ravi), త్రిష(trisha), శోభితా దూళిపాళ్లతో తపాటు పలువురు దక్షిణాది నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
సోమవారం నుండి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. విక్రమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చోళ యువరాజు కరికాలన్ గా విక్రమ్ కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. క్రూరుడైన పోరాట యోధుడిగా విక్రమ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని వెల్లడించారు. ఈ పోస్టర్ లో గుర్రంపై కూర్చొని డిఫరెంట్ లుక్ లో విక్రమ్ కనిపిస్తున్నారు.
చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజరాజ చోళుడు సాధించిన విజయాలు, రాచరికపు కుట్రలు, కుతంత్రాలతో ఈ సినిమా రూపొందుతోంది. పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్యారాయ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాల్లో పొన్నియన్ సెల్వన్ ఒకటి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఏ.ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.