తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthi: కార్తీ 'సర్దార్' తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన నాగార్జున

Karthi: కార్తీ 'సర్దార్' తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన నాగార్జున

28 June 2022, 6:15 IST

    • హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున కొనుగోలు చేశారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు.
సర్దార్
సర్దార్ (Twitter)

సర్దార్

కోలీవుడ్ యాక్టర్ కార్తీకి.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా అనువాదమై మంచి వసూళ్లు సాధిస్తాయి. అందుకే బడా నిర్మాతలు సైతం ఆయన సినిమా హక్కులను కొనుగోలు చేసి ఇక్కడ విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఈ హీరో నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్‌ కోసం మన నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ ఆ అవకాశం మాత్రం టాలీవుడ్ కింగ్ నాగార్జునే దక్కించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

కార్తీ నటించిన సర్దార్ చిత్ర తెలుగు హక్కులను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సొంతం చేసుకున్నారు.ఆయన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కార్తీ-నాగార్జున కలిసి ఇప్పటికే ఊపిరి సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రానున్న ఈచిత్రంలో కార్తీ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు.

సర్దార్ చిత్రంలో కార్తీ డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నారట. ఓ యువ పోలీస్ అధికారిగా, ఓ ఖైదీగా రెండు పాత్రల్లో కార్తీ అలరించనున్నారట. రజీషా విజయన్, రాశీ ఖన్నా ఇద్దరూ హీరోయిన్లుగా చేస్తున్నారు. నిన్నటి తరం హీరోయిన్ లైలా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఈమెతో పాటు చుంకీ పాండే, ప్రిన్స్, మునీశ్ కాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

కార్తీ సర్దార్ ఈ దీపావళీకి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అప్పుడే హీరో అజిత్ సినిమా రానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పేలా లేదు. సర్దార్‌తో పాటు కార్తీతో విరుమాన్, పొన్నియన్ సెల్వన్ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాలు సర్దార్ కంటే ముందే ఆగస్టు 15వ ఒకటి, సెప్టెంబరు 30న మరోకటి వరుసగా విడుదల కానున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం