PKSDT Movie Title : పవన్-సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఫిక్స్!
09 May 2023, 12:52 IST
- Pawan Kalyan New Movie : పవర్ స్టార్ ఓ వైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా పేరుపై ఓ వార్త వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమా చేస్తున్నాడు. పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా ఇందులో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయినట్టుగా తెలుస్తోంది. మామ-అల్లుడు కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళ సినిమా 'వినోదయ సీతమ్' రిమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి.. ఓ టైటిల్ వైరల్ అవుతోంది. ఇటీవల 'దేవుడే దిగి వచ్చిన' అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా 'బ్రో' అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. బ్రో అనే టైటిల్ ఈ చిత్రానికి సరిగా సరిపోతుందని అనుకుంటున్నారట. ఈ టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో(Pawan Kalyan Sai Dharam Tej Movie) మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీలు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్రివిక్రమ్(Trivikram) డైలాగ్స్, స్క్రీన్ ప్లేకు వర్క్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలఖరున మెుదలైంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. అయితే వెంటనే.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు సంబంధించిన పార్ట్ ను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. మూవీ షూటింగ్ పూర్తవడానికి వచ్చినట్టుగా సమాచారం. మిగిలిన భాగం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. జులై 28న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం వస్తుంది. కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.. జీ5లో స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ తో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారు. మామ-అల్లుడి సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బ్రో అనే టైటిల్ సెట్ అవుతుందని, అదే పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారట.
టాపిక్