తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Record Bookings: పఠాన్ అరుదైన ఘనత.. రికార్డు సంఖ్యలో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్

Pathaan Record Bookings: పఠాన్ అరుదైన ఘనత.. రికార్డు సంఖ్యలో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్

24 January 2023, 12:28 IST

    • Pathaan Record Bookings: కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన పఠాన్ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రికార్డు సంఖ్యలో టికెట్ బుకింగ్స్ నమోదయ్యాయి.
పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్
పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్

పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్

Pathaan Record Bookings: బాలీవుడ్‌లో ఓ పక్క బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ మరోపక్క షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్‌కు మాత్రం భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. షారుఖ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ విషయంలో అరుదైన ఘనత సాధించింది. పఠాన్ చిత్రానికి 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్ మై షో పోర్టల్ అందించిన సమాచారం మేరకు 10 లక్షల టికెట్లు బుకింగ్స్ రూపంలో కొనుగోలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

సోమవారం నాడు ఐనాక్స్ సినిమాస్ 2.75 లక్షల టికెట్లు బుక్ అయినట్లు అధికారిక సమాచారం. ఈ విషయాన్ని ఐనాక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేసింది."దేశంలోని అన్నీ ఐనాక్స్ థియేటర్లలో ఫస్ట్ వీకెండ్ వరకు 2.75 లక్షల పఠాన్ టికెట్లు అమ్ముడయ్యాయి. క్రేజ్ మిస్సవకండి, 2023లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి. పఠాన్ ఇంకో రెండో రోజులు మాత్రమ ఉంది" అని ట్వీట్ చేసింది.

మరోపక్క బుక్‌మై షోలో పది లక్షల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బుక్ మై షో సీఓఓ ఆశిష్ సక్సెనా తెలిపారు. "నాలుగు ఏళ్ల నిరీక్షణ తర్వాత షారుఖ్ నటించిన పఠాన్ సినిమాపై అంచనాలు టికెట్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా బుక్ మై షో అడ్వాన్స్ సేల్స్ పది లక్షల టికెట్లను అధిగమించింది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌లో పఠాన్ కోసం 3500 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్ పెరగడం వల్ల భారత్ అంతటా ఎంపిక చేసిన సినిమా థియేటర్లు సినిమా కోసం ఉదయం నుంచి సందడి నెలకొనే అవకాశముంది." అని ఆయన అన్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25వ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం