Pathaan Record: ఈ ఘనత సాధించిన తొలి హిందీ సినిమా పఠాన్‌-pathaan record as it becomes first indian movie to shot at siberian lake baikal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Record: ఈ ఘనత సాధించిన తొలి హిందీ సినిమా పఠాన్‌

Pathaan Record: ఈ ఘనత సాధించిన తొలి హిందీ సినిమా పఠాన్‌

Hari Prasad S HT Telugu
Jan 17, 2023 12:06 PM IST

Pathaan Record: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా రిలీజ్‌కు ముందే ఓ రికార్డును సొంతం చేసుకుంది. నిజానికి అసలీ ఘనత సాధించిన తొలి హిందీ సినిమాగా కూడా నిలవడం విశేషం.

గడ్డకట్టిన బైకాల్ సరస్సుపై పఠాన్ మూవీ షూటింగ్
గడ్డకట్టిన బైకాల్ సరస్సుపై పఠాన్ మూవీ షూటింగ్

Pathaan Record: బాలీవుడ్‌లో చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా పఠాన్. షారుక్ ఖాన్‌ నాలుగేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు రిలీజ్‌కు ముందే ఈ సినిమాను చుట్టుముట్టిన వివాదాలు మూవీకి కావాల్సినంత నెగటివ్‌ పబ్లిసిటీని ఇచ్చాయి. జనవరి 25న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులోని యాక్షన్‌ సీన్స్‌ మూవీపై ఆసక్తి రేపుతున్నాయి.

గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో పఠాన్‌ మూవీలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. దీనికోసం ప్రొడ్యూసర్‌ ఆదిత్య చోప్రా భారీగా ఖర్చు చేశారు. డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ నేపథ్యంలో పఠాన్‌ మూవీ రిలీజ్‌కు ముందే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సైబీరియా ప్రాంతంలోని గడ్డకట్టిన బైకాల్‌ సరస్సుపై షూటింగ్‌ చేసిన తొలి ఇండియన్‌ సినిమాగా రికార్డు సృష్టించింది.

గతంలో ఇలాంటి సినిమాల్లో భారతీయ ప్రేక్షకులు చూసిన యాక్షన్‌ సీన్లకు ఎన్నో రెట్లు ఎక్కువ థ్రిల్‌ అందించేలా పఠాన్‌ను షూట్‌ చేసినట్లు డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ చెప్పాడు. ఇప్పటి వరకూ ఏ ఇండియన్‌ సినిమా ప్రయత్నించని యాక్షన్‌ సీక్వెన్స్‌ను పఠాన్‌ కోసం చిత్రీకరించారు. అందులో భాగంగానే సైబీరియాలోని గడ్డ కట్టిన బైకాల్‌ సరస్సుపై బైక్ చేజ్‌ సీన్లను షూట్‌ చేశారు.

ఈ సరస్సు రష్యా రాజధాని మాస్కోకు 2000 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ చేజింగ్‌ సీన్లను చిత్రీకరించడానికి కావాల్సిన మొత్తం సామాగ్రిని అంత దూరంలో ఉన్న మాస్కో నుంచే తీసుకురావాలి. అది చేయడంలో మూవీ యూనిట్‌ సక్సెసైంది. గడ్డ కట్టించే చలిలోనూ బైకాల్ సరస్సుపై ఈ చేజింగ్‌ సీన్‌ను విజయవంతంగా చిత్రీకరించడంలో డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌, మూవీ యూనిట్‌ సక్సెస్‌ సాధించింది.

ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ థియేటర్లలో ప్రేక్షకులను మంచి థ్రిల్‌కు గురి చేస్తుందన్న ఆశతో పఠాన్‌ టీమ్‌ ఉంది. విలన్‌ జాన్‌ అబ్రహంను హీరో షారుక్‌ చేజ్‌ చేసే సీన్‌ ఇది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న పఠాన్‌ మూవీలో షారుక్‌, జాన్‌ అబ్రహంతోపాటు దీపికా పదుకోన్‌ కూడా నటిస్తోంది. ఈ మూవీలో బేషరమ్‌ రంగ్‌ పాటలో ఆమె వేసుకున్న డ్రెస్సులపై ఇప్పటికే తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం