OTT Top Korean Movies: ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
04 April 2024, 22:07 IST
- OTT Top Korean Movies: మలయాళం సినిమాల్లాగే కొరియన్ మూవీస్ కూడా ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ మూవీస్ మీరు చూశారా?
ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
OTT Top Korean Movies: కొరియన్ డ్రామాస్ కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ సినిమాకు ఓ కొత్త నడక నేర్పుతున్న అక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వీటిలో ఆస్కార్ విన్నర్ పారాసైట్ తోపాటు పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.
టాప్ కొరియన్ సినిమాలు ఇవే
కొరియన్ మూవీస్ లో చాలా వరకూ ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు గత 20 ఏళ్లలోనే వచ్చాయి.
పారాసైట్ - ప్రైమ్ వీడియో
2018లో వచ్చిన పారాసైట్ మూవీ ఒక రకంగా ప్రపంచానికి కొరియన్ సినిమాల సత్తా ఏంటో పరిచయం చేసింది. ముఖ్యంగా ఇండియన్ మూవీ లవర్స్ ఈ ఆస్కార్ విన్నింగ్ సినిమా తర్వాతే కొరియన్ సినిమాలను ఫాలో అవడం మొదలుపెట్టారు. సమాజంలో ఆర్థికపరమైన అసమానతలు ఓ స్థాయిలో పెరిగిపోతున్నాయి.
అయితే ధనవంతులు, పేదల మధ్య ఉన్న గ్యాప్ ఎలాంటిదో ఈ పారాసైట్ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ పేదరికాన్ని అధిగమించడానికి ఓ కుటుంబం డబ్బున్న ఇంట్లో పనివాళ్లుగా చేరిన తర్వాత వాళ్లు ఎదుర్కొనే సవాళ్లతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది.
మెమొరీస్ ఆఫ్ మర్డర్ - నెట్‌ఫ్లిక్స్
మెమొరీస్ ఆఫ్ మర్డర్ ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 1980ల్లో కొరియాలోని ఓ చిన్న టౌన్లో జరిగిన వరుస హత్యలు, వాటి విచారణ జరిగే తీరుపై ఈ సినిమా తెరకెక్కింది. మెమొరీస్ ఆఫ్ మర్డర్ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
సేవ్ ద గ్రీన్ ప్లానెట్ - నెట్‌ఫ్లిక్స్
మన భూమిపై ఆండ్రోమెడా నుంచి వచ్చి ఏలియన్స్ ఉన్నారని, వాళ్లు మన భూమిని నాశనం చేయడానికి వచ్చారని నమ్మే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కామెడీ మూవీ ఇది. ఆ ఏలియన్స్ కు ఓ ఫార్మా కంపెనీ యజమానే లీడర్ అని నమ్మి అతన్ని కిడ్నాప్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్ - ప్రైమ్ వీడియో
ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ఓ గ్యాంగ్‌స్టర్ తో కలిసి ఓ పోలీస్ ఆఫీసర్ చేసే వింత ప్రయత్నమే ఈ ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్ మూవీ. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఓల్డ్‌బాయ్ - నెట్‌ఫ్లిక్స్
2003లో వచ్చిన ఈ ఓల్డ్ బాయ్ మూవీ కొరియన్ సినిమా దశ దిశనే మార్చేసినట్లు చెబుతారు. ఓ వ్యాపారవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి 15 ఏళ్ల పాటు చిత్రహింసలు పెడతారు. తర్వాత వదిలేస్తారు. అయితే అసలు తనను ఎవరు బంధించారో తెలుసుకొని, వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వ్యక్తి చూస్తాడు. కానీ దీనికోసం అతని దగ్గర 5 రోజుల సమయమే ఉంటుంది. తర్వాత అతడు ఏం చేస్తాడన్నది ఈ మూవీలో చూడొచ్చు.