OTT Revenge Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం
28 November 2024, 16:33 IST
- OTT Revenge Thriller: ఓటీటీలోకి మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అడుగుపెట్టబోతోంది. గ్యాంగ్ రేప్‌కు గురైన తన కూతురికి న్యాయం కోసం ఓ తల్లి చేసే పోరాటం చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రాబోతోంది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం
OTT Revenge Thriller: రివేంజ్ థ్రిల్లర్ జానర్ లో ఓటీటీలోకి మరో వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు మేరీ (Maeri). ఈ మధ్యే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. గ్యాంగ్ రేప్‌కు గురైన కూతురికి కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఓ తల్లి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రతీకారం తీర్చుకునే రివేంజ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మేరీ సిరీస్ తెరకెక్కింది.
మేరీ ఓటీటీ రిలీజ్ డేట్
మేరీ (Maeri) వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సిరీస్ ను డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. "న్యాయం జరగనప్పుడు ఓ తల్లి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది.
మేరీ డిసెంబర్ 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది" అంటూ జీ5 గురువారం (నవంబర్ 28) వెల్లడించింది. సాయి దేవ్‌దర్ లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
మేరీ ట్రైలర్ ఎలా ఉందంటే?
మేరీ వెబ్ సిరీస్ ఓ గ్యాంగ్‌రేప్‌కు గురైన అమ్మాయి, న్యాయం కోసం ఆమె తల్లి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. సాయి దేవ్‌దర్ తన కూతురికి న్యాయం కోసం ప్రయత్నించే తల్లి పాత్రలో నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఓ అమ్మాయిని నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేస్తారు.
ఆ తర్వాత నిందితులను పోలీసులు పట్టుకున్నా.. కోర్టు వాళ్లను నిర్దోషులుగా విడుదల చేస్తుంది. అక్కడ దక్కాల్సిన న్యాయం దక్కకపోవడంతో ఇక వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పనిని ఆ తల్లి తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో ఆ అమ్మ సక్సెస్ అయిందా లేదా అన్నదే ఈ మేరీ సిరీస్ స్టోరీ. ఈ సరికొత్త రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.