తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న టాప్ సినిమాలు ఇవే.. భారతీయుడు 2, తాప్సీ మూవీ సహా మరిన్ని..

OTT Movies this week: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న టాప్ సినిమాలు ఇవే.. భారతీయుడు 2, తాప్సీ మూవీ సహా మరిన్ని..

05 August 2024, 10:10 IST

google News
    • OTT Movies release this week: ఓటీటీల్లోకి ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. భారతీయుడు 2 చిత్రం అప్పుడే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. తాప్సీ మెయిన్ రోల్ చేసిన మూవీ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
OTT Movies this week: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న టాప్ సినిమాలు ఇవే.. భారతీయుడు 2, తాప్సీ మూవీ సహా మరిన్ని..
OTT Movies this week: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న టాప్ సినిమాలు ఇవే.. భారతీయుడు 2, తాప్సీ మూవీ సహా మరిన్ని..

OTT Movies this week: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న టాప్ సినిమాలు ఇవే.. భారతీయుడు 2, తాప్సీ మూవీ సహా మరిన్ని..

ఓటీటీల్లోకి ఈ వారం (ఆగస్టు 2వ వారం) కూడా చాలా చిత్రాలు క్యూ కడుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర చేసిన భారతీయుడు 2 చిత్రం ఈవారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. మమ్ముట్టి సూపర్ హిట్ చిత్రం కూడా రానుంది. తాప్సీ నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా.. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న ముఖ్యమైన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

భారతీయుడు 2

ఎన్నో అంచనాలతో వచ్చిన భారతీయుడు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మూవీలో లోకనాయుకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. క్లాసిక్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‍గా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజైన భారతీయుడు 2 నెగెటివ్ టాక్‍తో చతికిలపడింది. దీంతో నెలలోగానే ఓటీటీలోకి ఈ చిత్రం వస్తోంది. భారతీయుడు 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్టు 9వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. అవినీతిపరులను అంతం చేసే సేనాపతి పాత్రలో మళ్లీ ఈ చిత్రంలో కనిపించరు కమల్. విభిన్న గెటప్‍ల్లో మెప్పించారు. భారతీయుడు 2 మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక భవానీ శంకర్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

టర్బో

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. మే 23న రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో దూసుకెళ్లింది. వైశాఖ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. టర్బో చిత్రం ఆగస్టు 9వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో టర్బో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది.

ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా

హీరోయిన్ తాప్సీ పన్ను, 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే ప్రధాన పాత్రల్లో ఫిర్ అయీ హసీన్ దుల్‍రూబా సినిమా రూపొందింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్టు 9వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. హసీన్ దుల్‍రూబాకు సీక్వెల్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

గూడ్‍చాడీ

గూడ్‍చాడీ సినిమా కూడా నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. ఈ చిత్రం జియోసినిమా ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 9వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రథ్ సమ్తాన్, ఖుషాలీ కుమార్, అరుణా ఇరానీ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పాత్రలు పోషించారు. రెండు తరాలకు చెందిన రెండు ప్రేమ జంటల మధ్య లవ్ స్టోరీలతో గుడ్‍చాడీ మూవీ వస్తోంది. ఈ చిత్రానికి బోనియో గాంధీ దర్శకత్వం వహించారు.

తదుపరి వ్యాసం