Bharateeyudu 2 OTT: అఫీషియల్ - నెల రోజుల్లోనే ఓటీటీలోకి భారతీయుడు 2 - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్!
Bharateeyudu 2 OTT: కమల్‌హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన భారతీయుడు 2 మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి ర ఆబోతోంది. ఆగస్ట్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Bharateeyudu 2 OTT: విలక్షణ హీరో కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఆదివారం ఆఫీషియల్‌గా వెల్లడైంది. ఆగస్ట్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో భారతీయుడు 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
250 కోట్ల బడ్జెట్ - 100 కోట్ల కలెక్షన్స్...
భారతీయుడు 2 మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో మూవీని ప్రొడ్యూస్ చేశాడు. 1996లో రిలీజైన కల్ట్ క్లాసిక్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా సేనాపతి పాత్రను ప్రధానంగా చేసుకొని దర్శకుడు శంకర్ భారతీయుడు 2 మూవీని రూపొందించాడు.
శంకర్ చెప్పాలనుకున్న పాయింట్ ఔట్‌డేటెడ్ కావడంతో భారతీయుడు 2 డిజాస్టర్‌గా నిలిచింది. వంద కోట్ల లోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చింది. తమిళంతో మోస్తారు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో మాత్రం మినిమం కలెక్షన్స్ రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.
శంకర్‌పై విమర్శలు...
కమల్‌హాసన్ యాక్టింగ్‌తో పాటు శంకర్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. మరోవైపు కమల్‌హాసన్ కంటే సిద్ధార్థ్ రోల్ ఎక్కువ సేపు స్క్రీన్‌పై కనిపించడం, కమల్‌ను కేవలం యాక్షన్ అంశాలకు పరిమితం చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతే కాకుండా కమల్‌హాసన్ లుక్, అతడి మేకప్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
సేనాపతి రిటర్న్స్....
చిత్ర అరవింద్ (సిద్ధార్థ్) ఓ యూట్యూబర్. లంచగొండి ఆఫీసర్ల అక్రమాలను తన ఛానెల్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తుంటాడు. యూట్యూబ్ ఛానెల్ కారణంగా అరవింద్ తో పాటు అతడి స్నేహితురాలు అర్తి (ప్రియా భవానీ శంకర్) జీవితాలు చిక్కుల్లో పడతాయి. చైనీస్ తైపీలో అజ్ఞాత జీవితం గడుపుతోన్న సేనాపతి ప్రజల పిలుపు మేరకు మళ్లీ ఇండియాకు వస్తాడు. అవినీతిపరులను అంతమొందిస్తుంటాడు.
సేనాపతిని పట్టుకునేందుకు సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) ప్రయత్నిస్తుంటాడు. సేనాపతిమళ్లీ ఇండియాలోకి అడుగుపెట్టడానికి అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా? సేనాపతి ఇండియాకు రావాలని పిలుపు నిచ్చిన అరవింద్ తో పాటు చాలా మంది యువత అతడిని ఎందుకు ద్వేషించారు? అరవింద్ తల్లి ఆత్మహత్యకు కారణమేమిటి?అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూ నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్న తండ్రి (సముద్రఖని) గురించి అరవింద్‌కు ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అరవింద్ అండ్ టీమ్‌కు సహాయం చేసిన దిశ (రకుల్ ప్రీత్ సింగ్) ఎవరు? సేనాపతిని సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ పట్టుకున్నాడా? లేదా? అన్నదే భారతీయుడు 2 కథ.
భారతీయుడు 3 కూడా...
భారతీయుడు 2 కు కొనసాగింపుగా భారతీయుడు 3 రాబోతోంది. మూడో పార్ట్‌లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నది. భారతీయుడు 2 క్లైమాక్స్‌లో భారతీయుడు 3 టీజర్‌ను రిలీజ్ చేశారు. మూడో పార్ట్ జనవరిలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాపిక్