Manchu Family Dispute: మంచు ఫ్యామిలీలో వివాదంపై ఇండైరెక్ట్‌గా మంచు లక్ష్మీప్రసన్న రియాక్ట్.. ఒక్క మాటతో క్లారిటీ
Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో వివాదంపై మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కానీ.. నాలుగు రోజుల నుంచి మౌనంగా ఉన్న మంచు లక్ష్మీ మాత్రం ఆలస్యంగా.. అది కూడా ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు.
మంచు ఫ్యామిలీలో వివాదంపై గత నాలుగు రోజులుగా సైలెంట్‌గా ఉన్న మంచు లక్ష్మీప్రసన్న ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. గత ఆదివారం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవ జరగగా.. ఆ తర్వాత మంచు మనోజ్ గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా.. మంచు మోహన్ బాబు కూడా రాచకొండ సీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సాధారణంగా వివాదాలపై తన స్పందనను తెలియజేసే మంచు లక్ష్మీ ప్రసన్న.. ఈ వివాదంపై మాత్రం నాలుగు రోజులు మౌనంగా ఉండిపోయారు.
మంచు మనోజ్‌ని కన్విన్స్ చేయలేక
వాస్తవానికి మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవైన మరుసటి రోజు.. మంచు మనోజ్‌తో మాట్లాడేందుకు అతను ఉండే ఇంటికి లక్ష్మీ ప్రసన్న వెళ్లిన విజువల్స్ వైరల్‌గా మారాయి. కానీ.. ఆమె మీడియాతో మాట్లాడకుండా సోమవారం ఉదయం వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి మంచు మోహన్ బాబు ఇంట్లోకి మంచు మనోజ్ తన అనుచరులతో కలిసి చొరబడిన సమయంలో మంచు లక్ష్మీ ఆ ఇంట్లో లేదని సమాచారం. మంచు మనోజ్ గొడవతో.. అస్వస్థతకి గురైన మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముంబయికి మంచు లక్ష్మీ షిప్ట్
మంచు మనోజ్ ఈ ఏడాది మోహన్ బాబు ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచు విష్ణు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిపోగా.. మంచు లక్ష్మీ ముంబయికి షిప్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల విభేదాల కారణంగా మంచు మనోజ్ కూడా తన ఫ్యామిలీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వృత్తిరీత్యా తాను ముంబయికి షిప్ట్ అయినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ వివరణ ఇచ్చారు. కానీ.. మంచు మనోజ్.. మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుతో పాటు విష్ణు, లక్ష్మీకి ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
జస్ట్ రెండు అక్షరాల్లో
ఫ్యామిలీలో వివాదంపై మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ‘పీస్ (శాంతి)’ అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే ఫ్యామిలీ సభ్యులతో కూర్చొని సమస్యల పరిష్కారానికి తాను సిద్ధమని మంచు మనోజ్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మంచు విష్ణు, మంచు మోహన్ బాబు నుంచి మాత్రం ఇంకా పాజిటివ్ రియాక్షన్ రాలేదు.