Samantha Instagram: కొత్త ఏడాదిలో సమంతకు కొత్త పార్ట్‌నర్.. పెళ్లి, పిల్లలు అంటూ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
Samantha Instagram: సమంతకు కొత్త ఏడాదిలో కొత్త పార్ట్‌నర్ రాబోతున్నాడా? ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ అవుతోంది. అది రాబోయే 2025లో తన రాశికి సంబంధించిన అంచనాల పోస్టు కావడం విశేషం.
Samantha Instagram: సమంత ఇన్‌స్టాగ్రామ్ ను ఆమె అభిమానులు ప్రతి రోజూ గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా నాగ చైతన్య, శోభిత డేటింగ్, నిశ్చితార్థం, పెళ్లి తర్వాత సామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. అలాంటి వారికి ఇప్పుడు సమంత తన ఇన్‌స్టా స్టోరీస్ లో చేసిన ఓ పోస్టు చాలా వింతగా, ఆసక్తిగా అనిపిస్తోంది.
సమంత పోస్ట్ ఇదీ..
సమంత బుధవారం (డిసెంబర్ 11) తన ఇన్‌స్టా స్టోరీస్ లో వచ్చే ఏడాదికిగాను తన రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్నది పోస్ట్ చేసింది. అందులో ఒక పాయింట్ మాత్రం అభిమానులను ఆకర్షిస్తోంది. ఆమెన్ అంటూ ఆమె తన రాశి అంచనాలను పోస్ట్ చేసింది. అందులో చాలా నమ్మకమైన, ప్రేమ చూపించే భాగస్వామి దొరుకుతాడని కూడా ఉండటం విశేషం.
"వృషభం, కన్యా, మకరరాశి వాళ్ల అంచనాలు 2025లో ఇలా ఉన్నాయి.. చాలా బిజీగా గడుపుతారు.. మీ కళలో పురోగతి సాధిస్తారు. దానివల్ల మరింత డబ్బు సంపాదిస్తారు.. ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది.. ఎంతో నమ్మకమైన, ప్రేమగల భాగస్వామి లభిస్తాడు.. చాలా ఏళ్లుగా మీరు నిర్దేశించుకున్న పెద్ద లక్ష్యాలు నెరవేరుతాయి.. వివిధ మార్గాల్లో ఆదాయం వస్తుంది.. మరో చోటికి మారే అవకాశం ఉంటుంది.. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.. సంతానం.. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే.. లేదంటే జాగ్రత్తగా ఉండండి" అని సమంత ఆ పోస్టులో రాసుకొచ్చింది.
ఈ మధ్యే ప్రేమ గురించి సమంత మరో పోస్ట్ కూడా చేసింది. తన కుక్క సాషా ఫొటోను షేర్ చేస్తూ.. "సాషా ప్రేమలాగా మరే ప్రేమ ఉండదు" అనే క్యాప్షన్ ఉంచింది. ఈ పోస్టు కూడా వైరల్ అయింది.
నాగ చైతన్య, శోభిత పెళ్లి
సమంత మాజీ భర్త నాగ చైతన్య ఈ మధ్యే మరో పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. శోభితా ధూళిపాళ్ల మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. రెండేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరూ ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా.. డిసెంబర్ 4న పెళ్లితో ఒక్కటయ్యారు. చైతూ మరో పెళ్లితో ఇప్పుడు అందరి కళ్లూ సమంతపైనే ఉన్నాయి. ఆమె జీవితంలోకి మరో పార్ట్‌నర్ ఎప్పుడు వస్తాడు?
అసలు అతడు ఎవరు? సామ్ మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకుంటుందా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అన్నదానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇప్పటి వరకూ సామ్ స్పందించలేదు. అయితే చైతన్యతో విడిపోయిన తర్వాత కొందరు అభిమానుల నుంచి తాను ఎదుర్కొన్న ద్వేషం గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
టాపిక్