తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Psychological Thriller Movie: ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

OTT Psychological Thriller Movie: ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu

27 November 2024, 18:50 IST

google News
    • OTT Psychological Thriller Movie: ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వస్తోంది. మార్చి, 2022లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో డిజిటల్ ప్రీమియర్ కాబోతుండటం విశేషం.
ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

OTT Psychological Thriller Movie: మలయాళం మూవీ.. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. ఇది చాలు ఇక్కడి ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తి కనబరచడానికి. ఇప్పుడలాంటిదే ఓ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా పేరు నారదన్. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన ఈ సినిమా సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

నారదన్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్. మార్చి, 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. "ప్రతి మనిషి ఓ హెడ్‌లైనే. అతి త్వరలో నారదన్ బులిటెన్.

నారదన్ నవంబర్ 29 నుంచి ఆహాలో" అనే క్యాప్షన్ తో బుధవారం (నవంబర్ 27) ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని ఆహా వీడియో రివీల్ చేసింది. ఈ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

నారదన్ మూవీ స్టోరీ ఏంటంటే?

టొవినో థామస్ నటించిన నారదన్ మూవీ మార్చి 3, 2022లో థియేటర్లలో రిలీజైంది. ఆశిఖ్ అబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో టొవినో థామస్ తోపాటు అన్నా బెన్, షరాఫుద్దీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నారద న్యూస్ అనే ఛానెల్ నడిపే చంద్రప్రకాశ్ (టొవినో థామస్) అనే పేరు మోసిన జర్నలిస్టు చుట్టూ తిరిగే కథే ఈ నారదన్. నైతిక విలువలు పాటించే జర్నలిస్టుగా ఉన్న అతడు.. తర్వాత పై వాళ్ల నుంచి ఒత్తిడితో టీఆర్పీల కోసం వాటిని పక్కన పెడతాడు.

టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తాయి? ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాయన్నది ఈ మూవీలో డైరెక్టర్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే నారదన్ మూవీ తెలుగులోనూ వస్తుండటంతో ఓటీటీలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ సినిమాను శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఆహా వీడియో ఓటీటీలో చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం