తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Thriller: ఈ వారమే ఓటీటీలోకి రాబోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కౌంట్‌డౌన్ షురూ

OTT Horror Thriller: ఈ వారమే ఓటీటీలోకి రాబోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కౌంట్‌డౌన్ షురూ

Hari Prasad S HT Telugu

16 September 2024, 15:15 IST

google News
    • OTT Horror Thriller: ఈ వారం ఓటీటీలోకి ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. చాలా రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందటే ఎంతో ఆసక్తి రేపేలా ఉన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ పేరు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్.
ఈ వారమే ఓటీటీలోకి రాబోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కౌంట్‌డౌన్ షురూ
ఈ వారమే ఓటీటీలోకి రాబోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కౌంట్‌డౌన్ షురూ

ఈ వారమే ఓటీటీలోకి రాబోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కౌంట్‌డౌన్ షురూ

OTT Horror Thriller: ఓటీటీలోకి ఈ వారం తెలుగులో రాబోతున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. హారర్ సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. పది రోజుల కిందటే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సిరీస్ వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఓటీటీ

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ ఓటీటీ ఈ సిరీస్ కు కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టింది. మరో నాలుగు రోజుల్లోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది.

డాక్టర్ విశ్వక్సేన్ ఎక్స్‌పెరిమెంట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అనే క్యాప్షన్ తో హాట్‌స్టార్ ఈ సిరీస్ గురించి మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నెల 6వ తేదీన సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

భయపెడుతున్న ట్రైలర్

ప్రియా ఆనంద్, నందు, తేజస్విని, అశుతోష్ రాణాలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ భయపెడుతూ సాగింది. "ఎటు చూసినా ప్రమాదాలే కనిపిస్తున్న వేళ చివరి వరకు ఎవరు ప్రాణాలతో మిగులుతారు. అబద్ధాలే అబద్ధాలతో సాగే అల్టిమేట్ గేమ్ చూడటానికి సిద్ధంగా ఉండండి. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ షేర్ చేసింది.

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. డాక్టర్ విశ్వక్సేన్ అనే వ్యక్తి గురించి చెబుతూ ట్రైలర్ మొదలవుతుంది. ఈ దీవి అంతా అతడు సృష్టించిందే అంటూ వాయిస్ ఓవర్ లో ఇంట్రడక్షన్ ఇస్తారు. అయితే తన తర్వాత ఆ సంపదకు వారసులు ఎవరు అన్నదే అతడు తేల్చుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం నికోబార్ లో ఉన్న తన ప్రైవేట్ ఐలాండ్ కు వారసులు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెబుతాడు. అలా ఎంతో మంది వారసులు అందులో తమ వాటా కోసం ఆ ఐలాండ్ కు వెళ్తారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాతే వాళ్లు వింత ఘటనలను ఎదుర్కొంటారు. వరుసగా ఒక్కొక్కరూ కనిపించకుండా పోతారు.

ఎక్కువ ఆస్తి కోసం తమలో ఉన్న వాళ్లే ఈ పని చేస్తున్నట్లు కూడా వాళ్లలో కొందరు అనుమానిస్తారు. తర్వాత ట్రైలర్ అంతా వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలతోనే సాగుతుంది. అలా వరుసగా ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? ఆ మోక్ష ఐలాండ్ లో అసలు ఏం జరుగుతోంది? చివరికి మిగిలేది ఎవరు? ఆ సంపదకు అసలు వారసలు ఎవరు అన్నది సిరీస్ లో చూడాల్సిందే.

తదుపరి వ్యాసం