OTT Telugu Horror Thriller: భయపెడుతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott telugu horror thriller web series the mystery of moksha island trailer released streaming date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Horror Thriller: భయపెడుతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Horror Thriller: భయపెడుతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 06, 2024 02:15 PM IST

OTT Telugu Horror Thriller: తెలుగులో ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. కొన్ని రోజుల కిందట ఈ సిరీస్ అనౌన్స్ చేయగా.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 6) ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు.

భయపెడుతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భయపెడుతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Horror Thriller: ఓటీటీలోకి మరో తెలుగు హారర్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ పేరు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. శుక్రవారం (సెప్టెంబర్ 6) సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా.. మొదటి నుంచీ చివరి వరకూ వెన్నులో వణుకు పుట్టించేలా సాగింది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ట్రైలర్

హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ తెలుగులో నేరుగా ఈ జానర్ లో వచ్చేవి చాలా తక్కువే. తాజాగా ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ పేరుతో అలాంటి వెబ్ సిరీస్ రాబోతోంది. ప్రియా ఆనంద్, నందు, తేజస్విని, అశుతోష్ రాణాలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ఈరోజు (సెప్టెంబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.

"ఎటు చూసినా ప్రమాదాలే కనిపిస్తున్న వేళ చివరి వరకు ఎవరు ప్రాణాలతో మిగులుతారు. అబద్ధాలే అబద్ధాలతో సాగే అల్టిమేట్ గేమ్ చూడటానికి సిద్ధంగా ఉండండి. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ షేర్ చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. డాక్టర్ విశ్వక్సేన్ అనే వ్యక్తి గురించి చెబుతూ ట్రైలర్ మొదలవుతుంది. ఈ దీవి అంతా అతడు సృష్టించిందే అంటూ వాయిస్ ఓవర్ లో ఇంట్రడక్షన్ ఇస్తారు. అయితే తన తర్వాత ఆ సంపదకు వారసులు ఎవరు అన్నదే అతడు తేల్చుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం నికోబార్ లో ఉన్న తన ప్రైవేట్ ఐలాండ్ కు వారసులు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెబుతాడు. అలా ఎంతో మంది వారసులు అందులో తమ వాటా కోసం ఆ ఐలాండ్ కు వెళ్తారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాతే వాళ్లు వింత ఘటనలను ఎదుర్కొంటారు. వరుసగా ఒక్కొక్కరూ కనిపించకుండా పోతారు.

ఎక్కువ ఆస్తి కోసం తమలో ఉన్న వాళ్లే ఈ పని చేస్తున్నట్లు కూడా వాళ్లలో కొందరు అనుమానిస్తారు. తర్వాత ట్రైలర్ అంతా వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలతోనే సాగుతుంది. అలా వరుసగా ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? ఆ మోక్ష ఐలాండ్ లో అసలు ఏం జరుగుతోంది? చివరికి మిగిలేది ఎవరు? ఆ సంపదకు అసలు వారసలు ఎవరు అన్నది సిరీస్ లో చూడాల్సిందే.

ఈ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసింది. సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నది చూడాలి.