OTT Horror Comedy: ఓటీటీలోకి 8 నెలల తర్వాత వస్తున్న కన్నడ హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్
04 December 2024, 15:52 IST
- OTT Horror Comedy: ఓటీటీలోకి ఇప్పుడో కన్నడ హారర్ కామెడీ మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన ఆ మూవీ.. 8 నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఓటీటీలోకి 8 నెలల తర్వాత వస్తున్న కన్నడ హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్
OTT Horror Comedy: కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో హారర్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు మ్యాటినీ (Matinee). గతంలో ఆయోగ్య అనే కన్నడ మూవీతో మంచి హిట్ కొట్టిన సతీష్ నినాసం, రచితా రామ్ జోడీ నటించిన సినిమా ఇది. కొత్త డైరెక్టర్ మనోహర్ కంపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగే సంపాదించింది.
మ్యాటినీ ఓటీటీ రిలీజ్ డేట్
కన్నడ హారర్ కామెడీ మూవీ మ్యాటినీ. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైంది. మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. మొత్తానికి సన్ నెక్ట్స్ ఓటీటీ ఇన్నాళ్లకు మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి మ్యాటినీ మూవీ సన్ నెక్ట్స్ లోకి రాబోతోంది.
దెయ్యాలున్నాయని అందరూ భయపడే ఓ ఇంటి చుట్టూ తిరిగే కథ ఇది. మ్యాటినీ మూవీకి ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉంది. సాధారణంగా చాలా మంచి సినిమాలకే ఈ రేటింగ్ వస్తుంటుంది.
మ్యాటినీ మూవీ స్టోరీ ఏంటంటే?
మ్యాటినీ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైంది. మనోహర్ కంపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సతీష్, రచితా రామ్ తోపాటు నాగభూషణ, పూర్ణ మైసూర్, దిగంత్ దివాకర్, శివరాజ్ కేఆర్ పీట్, అదితి ప్రభుదేవాలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ అరుణ్, అతని స్నేహితుల చుట్టూ తిరిగే కథ. అరుణ్ పాత్రలో సతీష్ నటించాడు.
కొన్ని కోట్ల విలువైన ఓ మ్యాన్షన్ అరుణ్ దగ్గర ఉంటుంది. త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అతని స్నేహితులు ఆ ఇంట్లో దెయ్యాలున్నాయంటూ ఆ ఇంటిని అమ్మడానికి అరుణ్ ను ఒప్పిస్తారు. అయితే వాళ్ల ప్లాన్ ఎదురుతిరుగుతుంది. ఆ ఇంట్లో ఉండటానికి వెళ్లిన వాళ్లకు నిజంగానే అక్కడ వింత శబ్దాలు భయపెడుతుంటాయి.
ఆ తర్వాత ఏం జరిగింది? అరుణ్ ఆ ఇంటిని అమ్ముతాడా? ఆ ఇంట్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలంటే ఈ మ్యాటినీ మూవీ చూడాల్సిందే. అయితే ఇలాంటి మూవీస్ కు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అనేది చాలా అవసరం. కానీ ఈ సినిమాలో అదే లోపించిందన్న విమర్శలు వచ్చాయి. మరి థియేటర్లలో అంతగా ఆడని ఈ మ్యాటినీ మూవీ ఓటీటీలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.