తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Anthology Web Series: ఆరు కథలతో వెబ్ సిరీస్.. కొత్త బంగారులోకం హీరోయిన్ నటించిన సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Anthology Web Series: ఆరు కథలతో వెబ్ సిరీస్.. కొత్త బంగారులోకం హీరోయిన్ నటించిన సిరీస్ స్ట్రీమింగ్ షురూ

09 October 2024, 20:24 IST

google News
    • OTT Anthology Web Series: జిందగీనమా ఓటీటీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి ఈ ఆంథాలజీ సిరీస్ ఎంట్రీ ఇచ్చింది. ఆరు కథలతో.. ఆరు ఎపిసోడ్లతో ఈ సిరీస్ ఉంది.
OTT Anthology Web Series: ఆరు కథలతో వెబ్ సిరీస్.. కొత్త బంగారులోకం హీరోయిన్ నటించిన సిరీస్ స్ట్రీమింగ్ షురూ
OTT Anthology Web Series: ఆరు కథలతో వెబ్ సిరీస్.. కొత్త బంగారులోకం హీరోయిన్ నటించిన సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Anthology Web Series: ఆరు కథలతో వెబ్ సిరీస్.. కొత్త బంగారులోకం హీరోయిన్ నటించిన సిరీస్ స్ట్రీమింగ్ షురూ

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కొంతకాలంగా విభిన్నమైన వెబ్ సిరీస్‍లు వస్తున్నాయి. థ్రిల్లర్లతో పాటు వివిధ జానర్లలో డ్రామా సిరీస్‍లు కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా ఆంథాలజీ వెబ్ సిరీస్ ‘జిందగీనమా’ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేసింది. నేడే (అక్టోబర్ 9) స్ట్రీమింగ్ మొదలైంది. జిందగీనమా సిరీస్ ఆరు కథలతో మానసిక సమస్యలపై రూపొందింది. ఆ వివరాలు ఇవే..

ఒక రోజు ముందుగానే..

జిందగీనమా సిరీస్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. అక్టోబర్ 10న తీసుకురానున్నట్టు ఈ ఓటీటీ ఇటీవల వెల్లడించింది. అయితే, ఒక రోజు ముందుగా నేటి సాయంత్రమే అందుబాటులోకి తెచ్చింది. హిందీ ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍ టైటిల్స్ అందుబాటులోకి ఉన్నాయి.

జిందగీనమా సిరీస్ స్ట్రీమింగ్ గురించి నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోనీలివ్. “కష్టాలను అధిగమించాలంటే తొలి మెట్టుగా వాటిని అంగీకరించాలి. ఆశ, బలానికి సంబంధించిన ఆరు కథల కలెక్షన్‍ను జిందగీనమాతో తీసుకొచ్చేశాం” సోనీలివ్ పేర్కొంది.

కొత్త బంగారు లోకం హీరోయిన్

జిందగీనమా వెబ్ సిరీస్‍కు ఆదిత్య సర్పోట్‍దార్, సుకృతి త్యాగి, డానీ మామిక్, రాకీ శాండిల్య, సహాన్, మితక్షర్ కుమార్ దర్శకత్వం వహించారు. ఒక్కొక్కరు ఒక్కో కథను డైరెక్ట్ చేశారు. శ్వేత బసు ప్రసాద్, పంకజ్ కొలి, శ్రేయస్ తల్పడే, అంజలి పాటిల్, సుమీత్ వ్యాస్, ఇవాంకా దాస్, మహమ్మద్ సమాద్, శివానీ రఘువంశీ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. 14 ఏళ్ల క్రితం కొత్త బంగారులోకం (2008) చిత్రంలో నటించిన శ్వేత బసు ప్రసాద్ బాగా పాపులర్ అయ్యారు. వివాదాల్లో చిక్కుకోవటంతో ఎక్కువగా సినిమా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. వెబ్ సిరీస్‍లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ జిందగీనమా సిరీస్‍లో ఓ లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు ఆమె లుక్ కూడా చాలా మారిపోయింది.

ఆరు కథలు ఇవే..

జిందగీనమా ఆరు కథలతో వస్తోంది. స్వాగతం, కేడ్జ్, భన్వర్, ది డైలీ పప్పెట్ షో, వన్ వన్, పర్పుల్ దునియా అనే ఆరు స్టోరీలు ఈ అంథాలజీ సిరీస్‍లో ఉన్నాయి. తొలి సీజన్‍లో ఆరు ఎపిసోడ్లు వచ్చాయి. సోనీ లివ్‍లో ఈ సిరీస్ చూసేయవచ్చు.

జిందగీనమా సిరీస్‍ను అప్లాజ్ ఎంటర్‌టైన్‍మెంట్స్, యాంటీమ్యాటర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ ఆరు కథల్లోనూ ప్రధాన పాత్రలు మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. జీవితంలో ఎదుర్కొనే పలు సమస్యలను మేకర్స్ ఈ సిరీస్‍లో చూపించారు. ఈ సిరీస్ ఎక్కువ భాగం ఎమోషనల్‍గానే సాగుతుంది.

సత్తాచాటుతున్న ‘మాన్వత్ మర్డర్స్’

సోనీ లివ్ ఓటీటీ వెబ్ సిరీస్‍లో ప్రస్తుతం ‘మాన్వత్ మర్డర్స్’ వెబ్ సిరీస్ టాప్‍లో ట్రెండ్ అవుతోంది. భారీ వ్యూస్ సాధిస్తూ సత్తాచాటుతోంది. ఈ సిరీస్ గత వారమే సోనీలివ్‍లోకి వచ్చింది. అషుతోష్ గోవార్కర్, సాయి థహన్‍కర్, సోనాలీ కులకర్ణి, ఉమేశ్ జగపత్, శార్దూల్ షరఫ్ ఈ సిరీస్‍లో లీడ్ రోల్స్ చేశారు. ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు ఆశిష్ అవినాశ్ బండే దర్శకత్వం వహించారు. మాన్వత్ మర్డర్స్ సిరీస్ తెలుగు, హిందీలోనూ స్ట్రీమ్ అవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం