Naga Chaitanya: కొత్త బంగారులోకంతో నాగ‌చైత‌న్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది - రివీల్ చేసిన శ్రీకాంత్ అడ్దాల‌-naga chaitanya and ram pothineni rejected kotta bangaru lokam script srikanth addala reveals intresting secrets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya: కొత్త బంగారులోకంతో నాగ‌చైత‌న్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది - రివీల్ చేసిన శ్రీకాంత్ అడ్దాల‌

Naga Chaitanya: కొత్త బంగారులోకంతో నాగ‌చైత‌న్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది - రివీల్ చేసిన శ్రీకాంత్ అడ్దాల‌

HT Telugu Desk HT Telugu
Oct 03, 2023 01:30 PM IST

Naga Chaitanya: కొత్త బంగారులోకంలో వ‌రుణ్ సందేశ్ కంటే ముందుగా నాగ‌చైత‌న్య‌ను హీరోగా అనుకున్నామ‌ని డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు. కానీ నాగ‌చైత‌న్య‌తో పాటు రామ్‌కు కూడా ఈ సినిమా క‌థ‌ను వినిపించిన‌ట్లు పెద‌కాపు ప్ర‌మోష‌న్స్‌లో శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు.

నాగ‌చైత‌న్య‌
నాగ‌చైత‌న్య‌

Naga Chaitanya: దిల్ రాజు నిర్మాణంలో 2009లో రిలీజైన జోష్ సినిమాతో అక్కినేని హీరో నాగ‌చైత‌న్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. జోష్ కంటే ముందు సూప‌ర్‌హిట్ మూవీ కొత్త బంగారులోకంలో నాగ‌చైత‌న్య‌కు ఛాన్స్ వ‌చ్చింది. కానీ ఆ అవ‌కాశాన్ని అత‌డు చేజార్చుకున్నాడు.

పెద‌కాపు ప్ర‌మోష‌న్స్‌లో కొత్త బంగారు లోకం సినిమాపై శ్రీకాంత్ అడ్దాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తాడు. కొత్త బంగారులోకంలో వ‌రుణ్ సందేశ్‌ కంటే ముందు నాగ‌చైత‌న్య‌ను హీరోగా అనుకున్న‌ట్లు శ్రీకాంత్ అడ్దాల తెలిపాడు.

నాగ‌చైత‌న్య‌ను హీరోగా ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నాల్లో నాగార్జున ఉన్నాడ‌ని తెలిసి..దిల్‌రాజు ద్వారా ఆయ‌న్ని క‌లిసి కొత్త బంగారు లోకం క‌థ‌ను వినిపించాన‌ని శ్రీకాంత్ అడ్డాల చెప్పాడు.

కానీ నాగ‌చైత‌న్య‌కు క‌థ సెట్ కాద‌నే ఆలోచ‌న‌తో నాగార్జున ఆ క‌థ‌ను తిర‌స్క‌రించార‌ని తెలిపాడు. ఆ త‌ర్వాత రామ్‌కు కూడా కొత్త బంగారులోకం క‌థ చెప్పాన‌ని, కానీ ఇంట‌ర్‌మీడియ‌ట్ కుర్రాడి పాత్ర‌ను చేయ‌డానికి అత‌డు ఒప్పుకోలేద‌ని శ్రీకాంత్ అడ్డాల అన్నాడు.

ఆ త‌ర్వాత హ్యాపీడెస్‌లో వ‌రుణ్‌సందేశ్‌ను చూసి అత‌డిని హీరోగా తీసుకున్నామ‌ని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నాడు. నాగ‌చైత‌న్య‌, రామ్‌పోతినేని చేయ‌న‌ని చెప్పిన సినిమాతో వ‌రుణ్ సందేశ్ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్నాడు.

కొత్త బంగారు లోకం సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా శ్రీకాంత్ అడ్దాల కెరీర్ ప్రారంభ‌మైంది. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా రెండు నంది అవార్డుల‌ను అందుకున్న‌ది. కొత్త బంగారు లోకం త‌ర్వాత సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బ్ర‌హ్మోత్స‌వం, నార‌ప్ప సినిమాలు చేశారు శ్రీకాంత్ అడ్డాల‌. దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత ఇటీవ‌లే పెద‌కాపు సినిమాతో తెలుగు ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చాడు.

Whats_app_banner