తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ!

OTT Action Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ!

Hari Prasad S HT Telugu

28 October 2024, 17:33 IST

google News
    • OTT Action Movie: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ కామెడీ మూవీ 20 రోజుల్లోనే రాబోతోంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన విశ్వం మూవీ ఓటీటీ రిలీజ్ పై తాజాగా బజ్ నెలకొంది.
ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ!
ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ!

ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ!

OTT Action Movie: ఓటీటీలోకి దీపావళి సందర్భంగా మరో లేటెస్ట్ తెలుగు యాక్షన్ కామెడీ మూవీ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ నటించిన ఈ సినిమాను శ్రీను వైట్ల డైరెక్ట్ చేశాడు. అక్టోబర్ 11న దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అంతంతమాత్రం రెస్పాన్స్ రావడంతో.. దీపావళికే సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

విశ్వం ఓటీటీ రిలీజ్ డేట్

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం అటు గోపీచంద్, ఇటు శ్రీను వైట్ల ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ కలిసి ఈ విశ్వంతో ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకుంటే.. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

దీంతో ఈ సినిమాను 20 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.15.8 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

విశ్వం మూవీ ఎలా ఉందంటే?

విదేశాల నుంచి వచ్చిన ఓ హీరో.. కేంద్ర మంత్రిని చంపాలని చూసే ఓ పాకిస్థానీ టెర్రరిస్టు.. ఓ హీరోయిన్, ఆమె చెల్లెలి చుట్టూ తిరిగే కథే ఈ విశ్వం మూవీ. శ్రీను వైట్ల మార్క్ సినిమా ఇది. అయితే ఒకప్పుడు తన మార్క్ కామెడీతో ఎన్నో హిట్స్ కొట్టిన అతడు.. ఈసారి మాత్రం ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేకపోయాడు.

విశ్వం మూవీలో క‌థ ప‌రంగా శ్రీనువైట్ల మూవీస్ ఓల్డ్ ఫ్లేవ‌ర్ ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. కామెడీతో ఆ ఫీల్ ఆడియెన్స్‌లో క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. టెర్ర‌రిజం బ్యాక్‌డ్రాప్‌, చెల్డ్‌సెంటిమెంట్‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, ల‌వ్ స్టోరీ జోడించి శ్రీనువైట్ల విశ్వం మూవీ క‌థ రాసుకున్నాడు.

క‌థ విష‌యంలో విశ్వం ఆక‌ట్టుకోక‌పోయినా కామెడీతో టైమ్‌పాస్ చేస్తుంది. డిఫ‌రెంట్ మ్యానరిజ‌మ్స్‌, పేర్ల‌తో కామెడీ క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో శ్రీనువైట్ల స్పెష‌లిస్ట్‌. ఇందులో జాలీరెడ్డి (పృథ్వీ), మ్యాంగో శ్యామ్‌(న‌రేష్‌) పాత్ర‌లు ఫ‌స్ట్ హాఫ్‌లో హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయి.

కామెడీ క‌ల‌గ‌సిన యాక్ష‌న్‌ పాత్ర‌లు గోపీచంద్ ఇదివ‌ర‌కు చాలానే చేశాడు. అందుకే విశ్వం పాత్ర‌ను ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కావ్య థాప‌ర్ గ్లామ‌ర్ ప‌రంగా సినిమాకు ప్ల‌స్స‌యింది. పృథ్వీ, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌గ‌తి, న‌రేష్‌, రాహుల్ రామ‌కృష్ణ ఇలా సినిమాలో చాలా మందే క‌మెడియ‌న్లు సినిమాలో క‌నిపిస్తారు. అంద‌రూ త‌మ ప‌రిధుల మేర న‌వ్వించారు. జిషు సేన్ గుప్తా విల‌నిజంలో కొత్త‌ద‌నం లేదు.

థియేటర్లలో ఫ్లాపయిన విశ్వం మూవీ ఓటీటీలో ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి. నవంబర్ 1న దీపావళి సందర్భంగా ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం