తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oscars Streaming In Ott: ఆస్కార్స్ లైవ్ స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే..

Oscars streaming in OTT: ఆస్కార్స్ లైవ్ స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే..

Hari Prasad S HT Telugu

06 March 2023, 21:08 IST

    • Oscars streaming in OTT: ఆస్కార్స్ లైవ్ స్ట్రీమింగ్ ఓటీటీలో కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సోమవారం (మార్చి 6) వేదికగా అనౌన్స్ చేసింది. ఆస్కార్స్ వేడుక వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున) జరగనున్న విషయం తెలిసిందే.
95వ అకాడెమీ అవార్డుల వేడుక మార్చి 12న జరగనుంది
95వ అకాడెమీ అవార్డుల వేడుక మార్చి 12న జరగనుంది (Matt Sayles/Invision/AP)

95వ అకాడెమీ అవార్డుల వేడుక మార్చి 12న జరగనుంది

Oscars streaming in OTT: ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డుల వేడుకకు టైమ్ దగ్గర పడింది. ఈ సెర్మనీ వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున) ఘనంగా జరగనుంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడటానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ప్రముఖ ఓటీటీ.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

ఈసారి ఆస్కార్స్ వేడుకను ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సోమవారం (మార్చి 6) ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ ఇండియాలో సోమవారం (మార్చి 13) ఉదయం 5.30 గంటల నుంచి లైవ్ స్ట్రీమ్ కానుంది.

95వ అకాడెమీ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నట్లు చెబుతూ హాట్‌స్టార్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. "సినిమాలు మీరు ఎప్పటికీ మరచిపోలేని డ్రీమ్స్. 95వ ఆస్కార్స్ లో డ్రీమ్ మేకర్స్ ను సెలబ్రేట్ చేయండి" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసుకుంది. వచ్చే సోమవారం (మార్చి 13) ఉదయం ఈ ఆస్కార్స్ వేడుక ఇండియాలో స్ట్రీమ్ అవుతుంది.

ఈసారి అకాడెమీ అవార్డులు ఇండియన్స్ కు మరింత ఆసక్తి రేపుతోంది. దీనికి కారణం మన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కావడం. ఈ పాటకు ఆస్కార్స్ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఇదే వేదికపై ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది.

దీనికితోడు ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ప్రజెంటర్లలో ఒకరిగా ఉంది. ఆమె ఈ వేడుకల్లో ఓ అవార్డు ప్రజెంట్ చేయనుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా ఆమె నిలవనుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం