తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone Oscars 2023: ఆస్కార్ ప్ర‌జెంట‌ర్‌గా దీపికా ప‌డుకోణ్ - రెండో భార‌తీయ న‌టిగా అరుదైన రికార్డ్‌

Deepika Padukone Oscars 2023: ఆస్కార్ ప్ర‌జెంట‌ర్‌గా దీపికా ప‌డుకోణ్ - రెండో భార‌తీయ న‌టిగా అరుదైన రికార్డ్‌

03 March 2023, 9:36 IST

  • Deepika Padukone Oscars 2023: బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌డుకోణ్ ఆస్కార్ 2023 వేడుక‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. ఈ అవార్డ్స్ వేడుక‌కు దీపికా ఎందుకు హాజ‌రుకానుందంటే...

 దీపికా ప‌డుకోణ్
దీపికా ప‌డుకోణ్

దీపికా ప‌డుకోణ్

Deepika Padukone Oscars 2023: బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌డుకోణ్ అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకోనున్న‌ది మార్చి 13న జ‌రుగ‌నున్న ఆస్కార్ వేడుక‌లో అవార్డ్స్ ప్ర‌జెంట‌ర్‌గా దీపికా ప‌డుకోణ్‌ వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

ఈ ఏడాది ఇండియా నుంచి ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న ఏకైక న‌టిగా దీపికా ప‌డుకోణ్ నిలిచింది. ప్ర‌జెంట‌ర్స్ లిస్ట్‌ను ఆస్కార్స్ నిర్వ‌హ‌కులు అనౌన్స్ చేశారు. ఈ జాబితాలో డ్వేన్ జాన్స‌న్‌, ఎమిలీ బ్లంట్‌, రిజ్ అహ్మ‌ద్‌, శ్యామూల్ ఎల్ జాక్స‌న్‌, గ్లెన్ క్లోజ్‌, మైఖేల్ బి జోర్డాన్‌, జోనాథ‌న్ మేజ‌ర్స్ లాంటి హాలీవుడ్ న‌టీమ‌ణుల‌తో క‌లిసి దీపికా ప‌డుకోణ్ స్థానాన్ని ద‌క్కించుకున్న‌ది.

విజేత‌ల‌కు ఈ దిగ్గ‌జ న‌టుల‌తో క‌లిసి దీపికా ప‌డుకోణ్ అవార్డ్స్ ప్ర‌జెంట్ చేయ‌బోతున్న‌ది. ఆస్కార్ అవార్డ్స్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న రెండో ఇండియ‌న్ న‌టిగా దీపికా ప‌డుకోణ్ నిల‌వ‌నుంది. 2016 ఆస్కార్స్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విజేత‌గా అవార్డును అంద‌జేసింది.

ప్రియాంక చోప్రా త‌ర్వాత దీపికా ప‌డుకోణ్ ప్ర‌జెంట‌ర్‌గా ఆస్కార్ వేదిక‌పై మెర‌వ‌నుంది. ఇండియా నుంచి ఆస్కార్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో రాజ‌మౌళి సినిమా పోటీప‌డ‌నుంది.

కాగా ఇటీవ‌ల ప‌ఠాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ఐఎస్ఐ ఏజెంట్‌గా దీపికా ప‌డుకోణ్ న‌టించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది దీపికా ప‌డుకోణ్‌. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమాతోనే దీపికా ప‌డుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.