Project k Deepika Padukone: ప్రాజెక్ట్ కేలో దీపికా ప‌డుకోణ్ క్యారెక్ట‌ర్స్‌పై ప్రొడ్యూస‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-project k updates producer ashwini dutt interesting comments on deepika padukone role in project k ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Project K Updates Producer Ashwini Dutt Interesting Comments On Deepika Padukone Role In Project K

Project k Deepika Padukone: ప్రాజెక్ట్ కేలో దీపికా ప‌డుకోణ్ క్యారెక్ట‌ర్స్‌పై ప్రొడ్యూస‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 26, 2023 10:59 AM IST

Project k Deepika Padukone: ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌పై నిర్మాత అశ్వ‌నీద‌త్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రివీల్ చేశాడు. ఆయ‌న ఏమ‌న్నాడంటే...

దీపికా ప‌డుకోణ్
దీపికా ప‌డుకోణ్

Project k Deepika Padukone: ప్ర‌స్తుతం పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ నెల‌కొన్న భారీ బ‌డ్జెట్‌ సినిమాల్లో ప్రాజెక్ట్ కే ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ చెప్పారు.

ఓ ఇంట‌ర్వ్యూలో ప్రాజెక్ట్ కేపై అశ్వ‌నీద‌త్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ప్రాజెక్ట్ కే క‌థ మొత్తం ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగా సాగినా దీపికా ప‌డుకోణ్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర‌ల‌కు సినిమాలో ప్రాధాన్య‌ముంటుంద‌ని తెలిపారు. దీపికా, అమితాబ్ క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించి మ‌రో ఏడు నుంచి ప‌ది రోజులు మాత్ర‌మే షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉంద‌ని పేర్కొన్నాడు. త్వ‌ర‌లోనే వారు తిరిగి షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

గ్రాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు సినిమాలో ఇంపార్టెన్స్ ఎక్కువేన‌ని, ఈ వీఎఫ్ఎక్స్ ప‌నుల కోసం ఐదు నెల‌ల క్రిత‌మే ఐదు కంపెనీల‌తో టై అప్ అయిన‌ట్లు అశ్వ‌నీద‌త్ చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ స్థానంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంతోష్ నారాయ‌ణ‌న్‌ను తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్పుకు గ‌ల కార‌ణాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. అశ్వ‌నీద‌త్ కామెంట్స్ ప్ర‌భాస్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. సూపర్ హీరో కథాంశంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

IPL_Entry_Point