Priyanka Chopra Valentines Day: నిక్‌తో గడిపే ప్రతిరోజు ప్రేమికుల రోజే - భర్తపై ప్రేమను చాటుకున్న ప్రియాంక చోప్రా
Priyanka Chopra Valentines Day: వాలెంటైన్స్ డే సందర్భంగా భర్త నిక్ జోనస్‌పై తనకున్న ప్రేమను చాటుకొంది ప్రియాంక చోప్రా. అంతే కాకుండా తాను హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త సినిమా పోస్టర్‌ను రిలీజ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Priyanka Chopra Valentines Day: భర్త నిక్ జోనస్ సహచర్యంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక చోప్రా. భర్తతో కలిసి ఆనందంగా గడుపుతోన్న ఫొటోలను, వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
నిక్‌పై తనకున్న ప్రేమను చాటుకునే ఏ ఒక్క సందర్భాన్ని ఆమె వదులుకోదని సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా నిక్ జోనస్ ను తాను ఎంతగానో ప్రేమిస్తుందో మరోసారి వ్యక్తం చేసింది ప్రియాంక చోప్రా. నిక్‌తో గడిపే ప్రతిరోజు తనకు ప్రేమికుల రోజే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2018 డిసెంబర్‌లో ఈ జంట పెళ్లిపీటలెక్కింది. గత ఏడాది సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది ప్రియాంక చోప్రా.
ప్రియాంక హాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది. లవ్ అగైన్ పేరుతో ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది ప్రియాంక చోప్రా.ఈ పోస్టర్‌లో హీరో సామ్ హ్యుగన్, ప్రియాంక చోప్రా రొమాంటిక్ లుక్‌లో దర్శనమిస్తోన్నారు. ఈ రొమ్ కామ్ సినిమా మే 12న రిలీజ్ కానుంది.