Academy Members: అకాడమీ కొత్త సభ్యులుగా భారత కళాకారులకు ఆహ్వానం-kajol and suriya among 397 members are invited by academy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Academy Members: అకాడమీ కొత్త సభ్యులుగా భారత కళాకారులకు ఆహ్వానం

Academy Members: అకాడమీ కొత్త సభ్యులుగా భారత కళాకారులకు ఆహ్వానం

Maragani Govardhan HT Telugu
Jun 29, 2022 10:43 AM IST

అకాడమీ కొత్త సభ్యులుగా కాజోల్, సూర్య సహా 397 మందిని ఆహ్వానించారు. భారత్ నుంచి ఏఆర్ రెహమాన్, అమితాబ్ బచ్చన్, ఖాన్ త్రయం, విద్యాబలన్ తదితరులు ఉన్నారు.

ఆస్కార్ కొత్త సభ్యులుగా సూర్య, కాజోల్
ఆస్కార్ కొత్త సభ్యులుగా సూర్య, కాజోల్ (Twitter)

ప్రతిష్టాత్మక అకాడమి మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త సభ్యులుగా పలువురి భారతీయులు ఎంపికయ్యారు. వీరిలో బాలీవుడ్ నటి కాజోల్, కోలీవుడ్ హీరో సూర్య సహా మొత్తం 397 మంది కళాకారులు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. గతేడాది బెస్ట్ డాక్యూమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న రైటింగ్ విత్ ఫైర్ దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఈ విషయాన్ని అకాడమీ బోర్డు మంగళవారం రాత్రి ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. కొత్త సభ్యులుగా ఎంపికైన వారి పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో కళాకారులు, థియేట్రికల్ మోషన్ పిక్చర్స్‌లో వివిభ విభాగాల్లో నిష్ణాతులై ఎనలేని కృషి చేసిన సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతల ఆధారంగా సభ్యులను ఎంపిక చేశారు.

"2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్య ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందినవారిని తీసుకున్నట్లు" అకాడమీ ప్రకటించింది.

మై నేమ్ ఈజ్ ఖాన్, కబీ ఖూషీ కబీ గమ్ లాంటి హిందీ సూపర్ హిట్లను సొంతం చేసున్న కాజోల్, ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సూర్య లాంటి వారిని అకాడమీ ఆహ్వానించింది. ఈ సంవత్సరం ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ డాక్యూమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేట్ అయిన రైటింగ్ విత్ ఫైర్ డాక్యూమెంటరీ తెరకెక్కించిన సుస్మిత్ ఘోష్, రింటూ థామస్ లాంటి వారు కూడా ఉన్నారు. తలాష్, గల్లీబాయ్, గోల్డ్ లాంటి హిందీ చిత్రాలతో పాపులర్ అయిన కగ్టీ కూడా రచయితలో జాబితాలో ఎంపికయ్యారు.

భారత చలనచిత్ర సీమ నుంచి ఆస్కార్ విజేత్ ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, విద్యా బాలన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలీ అఫ్జల్ లాంటి కళాకారులు ఉన్నారు. వీరితో పాటు నిర్మాతలు ఆదిత్య చోప్రా, గునీత్ మోంగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ లాంటి వారిని అకాడమీ ఆహ్వానించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్