తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ondu Sarala Prema Kathe Ott: ఓటీటీలోకి వచ్చిన కన్నడ ఫీల్ గుడ్ లవ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Ondu Sarala Prema Kathe OTT: ఓటీటీలోకి వచ్చిన కన్నడ ఫీల్ గుడ్ లవ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

20 March 2024, 15:09 IST

    • Ondu Sarala Prema Kathe OTT: ఒండ్రు సరళ ప్రేమ కథె సినిమా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఫీల్ గుడ్ లవ్ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చిందంటే..
Ondu Sarala Prema Kathe OTT: ఓటీటీలోకి వచ్చిన కన్నడ ఫీల్ గుడ్ లవ్ మూవీ.
Ondu Sarala Prema Kathe OTT: ఓటీటీలోకి వచ్చిన కన్నడ ఫీల్ గుడ్ లవ్ మూవీ.

Ondu Sarala Prema Kathe OTT: ఓటీటీలోకి వచ్చిన కన్నడ ఫీల్ గుడ్ లవ్ మూవీ.

Ondu Sarala Prema Kathe OTT: కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇటీవల వరుసగా లవ్ స్టోరీ సినిమాలు వస్తున్నాయి. కొన్ని బాగా పాపులర్ అవుతున్నాయి. ఆ జాబితాలోనే ఉంది ‘ఒండ్రు సరళ ప్రేమ కథె’ చిత్రం. ఫీల్ గుడ్ లవ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం వచ్చింది. వినయ్ రాజ్‍కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఇప్పుడు ఈ ‘ఒండ్రు సరళ ప్రేమ కథె’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

ప్లాట్‍ఫామ్ ఇదే..

ఒండ్రు సరళ ప్రేమ కథె సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ప్రస్తుతం కన్నడ భాషలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, తెలుగు డబ్బింగ్‍లో వస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.

ఒండ్రు సరళ ప్రేమ కథె సినిమాకు సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అతి అలియాజ్ అతిశయ్ పాత్రలో వినయ్ రాజ్‍కుమార్, మధుర క్యారెక్టర్లో మల్లికా సింగ్ నటించారు. స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు.

ఒండ్రు సరళ ప్రేమ కథె మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించారు. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. కార్తిక్ శర్మ, సబా కుమార్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి.. ఆది ఎడిటింగ్ చేశారు.

ఒండ్రు సరళ ప్రేమ కథె స్టోరీ బ్యాక్‍డ్రాప్

మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు అతిశయ్ (వినయ్ రాజ్‍కుమార్) మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తుంటాడు. తాను స్వరపరస్తున్న పాటల కోసం తన హృదయానికి నచ్చే గాత్రం కోసం ఎదురుచూస్తుంటాడు. తనకు కలలో ఓ అమ్మాయి గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తనకు నచ్చిన గొంతుతో ఓ అమ్మాయి తనకు ఇష్టమైన పాటను పాడుతుంది. మధుర (మల్లికా సింగ్) ఆ పాట పాడారని అతిశయ్ భావిస్తాడు. ఆమెను ఇష్టపడతాడు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమ గెలిచిందా? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేవి ఒండ్రు సరళ ప్రేమ కథె సినిమాలో చూడాలి. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి.

అబ్రహాం ఓజ్లెర్

మలయాళంలో భారీ హిట్ అయిన ‘అబ్రహాం ఓజ్లెర్’ చిత్రం నేడు (మార్చి 20) స్ట్రీమింగ్‍కు వచ్చింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అడుగుపెట్టింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జయరాం, ఐశ్వర్య రాజన్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్ చేశారు. జనవరి 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఇప్పుడు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం