OTT: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ కామెడీ మూవీ.. తొలిరోజే ట్రెండింగ్‌లోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
13 April 2024, 6:24 IST
Om Bheem Bush OTT Response: తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చిన తొలి రోజునే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ కామెడీ మూవీ.. తొలిరోజే ట్రెండింగ్‌లోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Om Bheem Bush OTT Streaming Now: సినిమా జోనర్లలో పూర్తి హారర్ టచ్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చే మూవీస్‌పై మంచి ఆదరణ చూపుతారు ఆడియెన్స్. సరైన టేకింగ్‌తో తెరకెక్కిస్తే హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు మంచి హిట్ కొడతాయి. అలా పూర్తి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చిన సినిమాగా పేరు తెచ్చుకుంది ఓం భీమ్ బుష్.
మరోసారి కామెడీతో
బ్రోచెవారెవరురా సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు, కమెడియన్ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ. అందులో వారి కామెడీ టైమింగ్ ఎలా వర్కౌట్ అయిందో తెలిసిందే. ఇటీవల ఈ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ఓం భీమ్ బుష్. ఈ ముగ్గురు కలిసి మరోసారి కామెడీతో మ్యాజిక్ చేసిన మూవీ ఇది. దీనికి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది క్యాప్షన్.
కలెక్షన్స్ అలా
ఓం భీమ్ బుష్ మూవీని దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించారు. ఆయన గతంలో హుషార్, రౌడీ బాయ్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముందు నుంచి టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 22న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఫలితంగా సూపర్ హిట్ అయింది. అలాగే కలెక్షన్స్ పర్వాలేదనిపించుకుంది.
20 రోజుల్లోనే ఓటీటీలోకి
అలాంటి సూపర్ హిట్ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా ప్రకటించినట్లే కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో 2వ స్థానం దక్కించుకుని సత్తా చాటుతుంది.
తొలి రోజే ట్రెండింగ్‌లో
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 2 ట్రెండింగ్‌లో దంచికొడుతోంది ఓం భీమ్ బుష్ మూవీ. విడుదలైన తొలి రోజునే ఇలా ట్రెండింగ్‌లో దూసుకుపోవడం ప్రస్తుతం విశేషంగా మారింది. థియేటర్లలో ఆదరించినట్లే ఈ సినిమాను ఓటీటీలో సైతం ఆడియెన్స్ మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక పాత్రలు
ఇదిలా ఉంటే, ఈ సినిమాను వి. సెల్యూలాయిడ్ బ్యానర్‌పై సునీల్ బలుసు కలిసి నిర్మించారు. యూవీ క్రియేషన్స్ ఈ మూవీని సమర్పించింది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, ప్రియదర్శికి జోడీలుగా ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పీహెచ్‌డీ పేరుతో
అలాగే ఈ సినిమాలో హుషారు ఫేమ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని అతిథి పాత్రలో కనిపించింది. ఆమె బ్యాంగ్ బ్రోస్ అనే పాటలో నర్తించి ఆకట్టుకుంది. సినిమా కథలోకి వెళితే.. ముగ్గురు స్నేహితులు యూనివర్సిటీలో పీహెచ్‌డీ పేరుతో నానా రచ్చ చేస్తుంటారు.
భైరవపురం గ్రామం
వాళ్లు చేసే పనులు తట్టుకోలేక తానే థీసిస్ కంప్లీట్ చేసి మరి బయటకు పంపిస్తాడు ఆ యూనివర్సిటీ ఇంఛార్జ్. ఆ తర్వాత ఆ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్లి అక్కడ ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.
టాపిక్