OTT Horror Movie: భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-telugu horror movie tantra ott streaming started now tantra digital premiere on aha tantra ott release ananya nagalla ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Horror Movie: భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 05, 2024 06:37 AM IST

Tantra OTT Streaming Now: తాజాగా ఓటీటీలోకి సరికొత్త హారర్ మూవీ వచ్చేసింది. అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ హారర్ మూవీ తంత్ర ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.. ప్రేక్షకులు ఎక్కడ చూడొచ్చనే వివరాల్లోకి వెళితే..

భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన న్యూ హారర్ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?
భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన న్యూ హారర్ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?

Tantra OTT Release: పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన సినిమా తంత్ర. ఈ సినిమాలో అనన్య నాగళ్లతోపాటు ఒకప్పటి హీరోయిన్ సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్షణ్ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మాతలుగా వ్యవహహించారు. పుల్ లెంత్ హారర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు.

పూర్తి హారర్ అంశాలతో తెరకెక్కిన తంత్ర మూవీ మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న లాంగ్ రన్‌లో ఆకట్టుకులేకపోయింది. అయితే, చిత్రంలో పూర్తిస్థాయిలో భయపెట్టేలా హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి పలువురు రివ్యూలు సైతం ఇచ్చారు. కానీ, సినిమాకు వచ్చిన మంచి టాక్ దాని కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపెట్టలేకపోయింది. ఫలితంగా కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద తంత్ర ప్లాప్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది.

అయితే, ఇప్పుడు నెల రోజులు కాకముందే అంటే థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది తంత్ర మూవీ. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తంత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మంచి ధరకు కొనుక్కుందని సమాచారం. ఇంతకుముందు ఆహా టీమ్ ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 5 నుంచి అంటే శుక్రవారం నుంచి ఓటీటీలో తంత్ర స్ట్రీమింగ్ అవుతోంది. అర్ధరాత్రి నుంచే తంత్ర ప్రసారం అవుతోంది. కాబట్టి, థియేటర్లలో తంత్ర సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఎంచక్కా చూసేయొచ్చు.

ఇకపోతే తంత్ర సినిమాలో ఎవరు ఎప్పుడూ చూడని విననటువంటి క్షుద్రపూజల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. ఇందులో అప్పట్లో ఓ ముఖ్యమంత్రి ఇలాంటి క్షుద్రపూజ నేర్చుకున్నాడని చెప్పే డైలాగ్ చాలా వైరల్ అయింది. దాంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అలాగే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ సైతం చాలా వరకు ఆకట్టుకున్నాయి.

కాగా అనన్య నాగళ్ల వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో అంజలి, నివేథా థామస్‌తోపాటు ఆమె కూడా కీ రోల్ ప్లే చేసింది. ఇక అనన్య నాగళ్ల మల్లేషం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శికి జోడిగా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అచ్చతెలుగు అమ్మాయిగా, ఎంతో పద్ధతిగా కనిపించి కనువిందు చేసింది. ఇప్పుడు పొట్టేల్ అనే మరో సినిమా చేస్తోంది అనన్య నాగళ్ల. ఇందులో ఘాటు లిప్ లాక్ సీన్‌తో ఇటీవల చాలా వైరల్ అయింది అనన్య.

తంత్ర సినిమా కథ విషయానికొస్తే.. రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుక‌తోనే త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మిని (స‌లోని) కోల్పోతుంది. నాన్నమ్మ సంరక్షణలో పెరుగుతుంది. . తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ఇష్టపడుతుంది. తేజూ వేశ్య కొడుకు కావ‌డంతో వారి ప్రేమ‌కు అనేక‌ అడ్డంకులు ఎదుర‌వుతుంటాయి. క్షుద్ర శ‌క్తుల కార‌ణంగా జ‌న్మించ‌డంతో రేఖ చుట్టూ ఎప్పుడూ ద‌య్యాలు తిరుగుతుంటాయి. పౌర్ణ‌మి వ‌చ్చిందంటే రేఖ‌ను వెతుక్కుంటూ ఓ ర‌క్త పిశాచి వ‌స్తుంటుంది. అందుకు కార‌ణం ఏమిటి? అనే విషయాలతో తంత్ర సినిమా సాగుతుంది.

టీ20 వరల్డ్ కప్ 2024