తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Olympics Geetha Govindam Song: ఒలింపిక్స్ కోసం గీత గోవిందం సాంగ్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదీ

Olympics Geetha Govindam Song: ఒలింపిక్స్ కోసం గీత గోవిందం సాంగ్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

16 June 2024, 19:45 IST

google News
    • Olympics Geetha Govindam Song: ఒలింపిక్స్ కోసం మన తెలుగు మూవీ గీత గోవిందం సాంగ్ వాడుకోవడం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ రియాక్టయ్యాడు.
ఒలింపిక్స్ కోసం గీత గోవిందం సాంగ్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదీ
ఒలింపిక్స్ కోసం గీత గోవిందం సాంగ్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదీ

ఒలింపిక్స్ కోసం గీత గోవిందం సాంగ్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదీ

Olympics Geetha Govindam Song: వచ్చే నెలలో జరగబోయే ఒలింపిక్స్ కోసం నిర్వాహకులు ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పారిస్ లో జరగబోయే ఈ గేమ్స్ కోసం అక్కడి ఐకానిక్ ఐఫిల్ టవర్ ను చూపిస్తే బ్యాక్‌గ్రౌండ్ లో మన గీత గోవిందం మూవీలోని సాంగ్ వాడుకున్నారు. ఇంకేం ఇంకేం కావాలే పాట వినిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అటు విజయ్ దేవరకొండ కూడా దీనిపై స్పందించాడు.

ఒలింపిక్స్‌లో గీత గోవిందం

ఈసారి ఒలింపిక్ గేమ్స్ పారిస్ లో జులై 26 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో గేమ్స్ ప్రమోషన్లను నిర్వాహకులు మొదలు పెట్టారు. ఒలింపిక్స్ అధికారిక సోషల్ అకౌంట్లలో ఎన్నో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పారిస్ లోని ఐఫిల్ టవర్ దగ్గర ఒలింపిక్స్ ఐదు రింగుల చిహ్నం ఉండటాన్ని చూపిస్తూ ఓ వీడియో రూపొందించారు.

అందులో బ్యాక్‌గ్రౌండ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నటించిన గీత గోవిందం మూవీలోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ వాడుకోవడం విశేషం. వారం కిందటే తమ ఇన్‌స్టాగ్రామ్ లో ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. అయితే తాజాగా దీనిని గమనించిన విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా దీనిపై స్పందించాడు.

"కొన్ని పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి" అనే క్యాప్షన్ తో గీత గోవిందం ఒలింపిక్స్ లో అని విజయ్ దేవరకొండ రియాక్టయ్యాడు. ఐఫిల్ టవర్ కొత్త లుక్ ఎవరికి నచ్చిందంటూ ఈ వీడియోను ఒలింపిక్స్ నిర్వాహకులు షేర్ చేశారు. ఇది తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్లోబల్ గేమ్స్ లో ఓ తెలుగు పాటను బ్యాక్‌గ్రౌండ్లో వాడటం నిజంగా విశేషమే.

ఫ్యాన్స్ ఏమన్నారంటే..

ఒలింపిక్స్ అధికారిక పేజ్ లో గీత గోవిందం పాట వినిపించడంపై అభిమానులు కూడా స్పందించారు. ఒలింపిక్స్ లో గీత గోవిందం పాట వాడుకున్నారా? వాహ్.. అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఈ పాటను గోపీ సుందర్ కంపోజ్ చేశాడు. దీంతో మరో ఫ్యాన్ దీనిపై స్పందిస్తూ.. "మలయాళీలు ఈ పాట మాది అని అనే ముందే చెబుతున్నా.. ఇది ఓ తెలుగు మాషప్ సాంగ్" అని అనడం విశేషం.

గీత గోవిందం 2018లో రిలీజైన మూవీ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కెరీర్లలో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా ఇది. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచే ఈ ఇద్దరి మధ్య ఏడో నడుస్తోందన్న పుకార్లు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక విజయ్, రష్మిక నటించిన మరో మూవీ డియర్ కామ్రేడ్ సినిమాకు యూట్యూబ్ లో 40 కోట్ల వ్యూస్ రావడాన్ని కూడా ఈ ఇద్దరూ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక మాత్రం పుష్ప 2, సికందర్, రెయిన్బో, ది గర్ల్‌ఫ్రెండ్, చావాలాంటి సినిమాలతో బిజీగా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం