Vijay Deverakonda Family Tour: అమెరికాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ టూర్.. చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్
Vijay Deverakonda Family Tour In America: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ అమెరికా టూర్‌లో ఉంది. ఈ టూర్‌లో విజయ్ దేవరకొండ తండ్రి, తల్లితోపాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు. అయితే, అక్కడ విజయ్ దేవరకొండను చూసిన అభిమానులు చుట్టుముట్టారు.
Vijay Deverakonda Family Tour In America: హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి అమెరికా టూర్‌లో ఉన్నారు. ఈ పర్యటనకు విజయ్ ఫాదర్ గోవర్థన్ (Vijaj Deverakonda Father Govardhan), మదర్ మాధవి (Vijay Deverakonda Mother Madhavi), సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) కూడా వెళ్లారు.
విజయ్ దేవరకొండ యూఎస్ టూర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు రావడం పట్ల అక్కడి తెలుగువారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకునేందుకు తెలుగువారు, అభిమానులు పోటీపడ్డారు. అంతేకాకుండా విజయ్‌ను చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్‌కు ఈ టూర్ నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే, అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా) ఏర్పాటు చేసిన ఈవెంట్ గెస్ట్‌గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత వుమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్‌కు కూడా విజయ్ దేవరకొండ అతిథిగా వెళ్లారు. ఆటా ఈవెంట్‌లో విజయ్ హీరోగా నటించిన సినిమాలతో పాటు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ పోస్టర్స్ ప్లే చేశారు.
ఆటా కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఆటా ఈవెంట్‌కు గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉంది. ఇక్కడి మన తెలుగువాళ్లను కలుసుకుని మాట్లాడటం హ్యాపీ ఫీల్ కలిగిస్తోంది. వాళ్లు నాపై చూపిస్తున్న లవ్ అండ్ అఫెక్షన్‌కు థ్యాంక్స్" అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
"మన తెలుగువారు చదువుల కోసం, ఉద్యోగాల కోసం యూఎస్ వచ్చారు. ప్రస్తుతం రెసిషన్ టైమ్ నడుస్తోంది. మీరంతా స్ట్రాంగ్‌గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. తమ పిల్లల కోసం అమెరికా వచ్చిన అత్తమ్మలు, మామయ్యలకు కూడా హాయ్ చెబుతున్నా" అని విజయ్ దేవరకొండ అన్నారు.
ఫ్యామిలీ మెంబర్స్‌తో విజయ్ దేవరకొండ అమెరికా టూర్ సందడిగా సాగుతోంది. విజయ్ యూఎస్ టూర్ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (Family Star Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
పరశురామ్ (Parasuram Petla) దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్‌కు నెగెటివిటీ కూడా స్ప్రెడ్ అయింది. కొన్నీ సీన్స్, ఫ్యామిలీ మూవీలో అభ్యంతరకర డైలాగ్స్ ఏంటని కామెంట్స్ వినిపించాయి. ఇక ఓటీటీలోకి వచ్చాక ఇంకాస్తా నెగెటివిటీ పెరిగింది. బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో (Amazon Prime OTT) స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఆనంద్ దేవరకొండ గం గం గణేశా (Gam Gam Ganesha Movie) సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. కానీ, రొటీన్ స్టోరీ అని ఎక్కువగా విమర్శలు వచ్చాయి. అయితే, సినిమా టేకింగ్, ట్విస్టులు బాగున్నాయని ప్రశంసలు కూడా దక్కించుకుంది.