NTR 30 First look: వచ్చేశాడు 'దేవర'.. పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చిన తారక్
19 May 2023, 19:39 IST
- NTR 30 First look: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న NTR 30 మూవీ టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను ఖరారు చేసింది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
దేవరగా ఎన్టీఆర్
NTR 30 First look: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్న సమయం వచ్చేసింది. ఎట్టకేలకు తారక్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాకుండా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. NTR 30గా రూపొందుతున్న ఈ సినిమాకు అందరూ అనుకున్నట్లుగానే దేవర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేయనున్నారు.
ఎన్టీఆర్ 40వ బర్త్ డే(మే 20) సందర్భంగా దేవర సినిమా లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే మూవీ ప్రమోషనల్ వీడియో ద్వారా విపరీతంగా బజ్ క్రియేట్ చేయడంతో దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగాయి. తారక్ తన ఫెరోషియస్ లుక్‌లో పవర్‌పుల్‌గా కనిపించారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే..ఎన్టీఆర్ లుంగీ ధరించి చేతిలో బడిసే లాంటి పెద్ద ఆయుధాన్ని పట్టుకొని పవర్‌ఫుల్‌గా నిలుచున్నారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన తారక్.. సముద్ర తీరంలో అలలు పోటేతెత్తున్న సమయంలో బండ్ల రాతిపై నిల్చొని తీక్షణగా చూస్తున్నట్లు కనిపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో పడవ, అందులో ఉన్న గుట్టలుగా పడి ఉన్న శవాలను కూడా గమనించవచ్చు. ఈ పోస్టర్‌ను చూస్తే ఎంతో ఉత్కంఠను కలగజేస్తుంది. ఇక టీజర్, ట్రైలర్ వస్తే అంచనాలు ఆకాశానికి అంటుతాయని ఫ్యాన్స్‌తో పాటు సినీ పండితులు అంటున్నారు.
NTR 30 చిత్రానికి దేవర అనే టైటిల్ మంచి యాప్ట్‌గా ఉంది. ఈ టైటిల్ ఇంకా హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.