NTR Hollywood Offer: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తారక్‌తో మూవీ చేసేందుకు హాలీవుడ్ దర్శకుడి ఆసక్తి-hollywood director james gunn wants to direct jr ntr
Telugu News  /  Entertainment  /  Hollywood Director James Gunn Wants To Direct Jr Ntr
ఎన్టీఆర్‌తో పనిచేసేందుకు హాలీవుడ్ దర్శకుడి ఆసక్తి
ఎన్టీఆర్‌తో పనిచేసేందుకు హాలీవుడ్ దర్శకుడి ఆసక్తి

NTR Hollywood Offer: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తారక్‌తో మూవీ చేసేందుకు హాలీవుడ్ దర్శకుడి ఆసక్తి

26 April 2023, 12:55 ISTMaragani Govardhan
26 April 2023, 12:55 IST

NTR Hollywood Offer: ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయి వరకు వెళ్లింది. తారక్‌తో కలిసి పనిచేసేందుకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

NTR Hollywood Offer: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఫలితంగా ఆస్కార అవార్డు సైతం దక్కించుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో మంది ఈ మూవీపై ప్రేమను కురిపించారు. ముఖ్యంగా వెస్టర్న్ ఆడియోన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారు. దీంతో మన స్టార్లకు హాలీవుడ్ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఓ హాలీవుడ్ దర్శకుడు. డీసీ స్టూడియోస్ అధినేత, ఫిల్మ్ మేకర్ అయిన జేమ్స్ గన్.. తారక్‌తో మూవీ చేయాలని ఆసక్తి చూపించారు.

ఇటీవల న్యూస్18తో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేమ్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన జేమ్స్ గన్.. గార్డియన్స్ యూనివర్స్‌లో తారక్‌ను భాగం చేయాలని ఆయన అనుకుంటున్నారట.

గార్డియన్స్ యూనివర్స్‌లో ఈ ఇండియన్ యాక్టర్‌ను భాగం చేయాలనకుంటున్నారు? అనే ప్రశ్నకు.. ఆర్ఆర్ఆర్ హీరోను తీసుకోవాలని అనుకుంటున్నట్లు జేమ్స్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎవరు అని ప్రశ్నించగా.. బోనులో నుంచి పులులతో పాటు దూకిన వ్యక్తి అంటూ సమాధానమిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పగా.. అవును.. అతడే అంటూ జేమ్స్ గన్ తన స్పందనను తెలియజేశారు. ఏదోక రోజు అతడితో పనిచేయాలని ఆశపడుతున్నానని స్పష్టం చేశారు.

గత జులైలో ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన జేమ్స్ గన్.. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఎన్‌టీఆర్-రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ మే5న విడుదల కానుంది.

మరోపక్క తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో NTR 30లో నటిస్తున్నారు. ఇటీవలే మూవీ సెట్స్‌లో కూడా అడుగుపెట్టారు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

టాపిక్