NTR 30 Update: వస్తున్నా.. కొరటాల మూవీకి సంబంధించి తారక్ క్రేజీ అప్డేట్.. వీడియో వైరల్-ntr shares a video of koratala shiva movie shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Shares A Video Of Koratala Shiva Movie Shooting

NTR 30 Update: వస్తున్నా.. కొరటాల మూవీకి సంబంధించి తారక్ క్రేజీ అప్డేట్.. వీడియో వైరల్

Maragani Govardhan HT Telugu
Apr 01, 2023 06:56 PM IST

NTR 30 Update: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో తారక్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు తారక్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సెట్స్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
సెట్స్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్

NTR 30 Update: ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించే తదిపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు తారక్. ఇటీవలే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌గా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ అడుగుపెట్టారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదలైంది.

వస్తున్నా.. అంటూ తారక్ తాను సెట్స్‌లో అడుగుపెట్టిన వీడియోను రిలీజ్ చేశారు. విడుదలైన వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. తారక్ అన్న వాయిస్ వింటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే కెన్నీ బెట్ స్టంట్ మాస్టర్‌గా, బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తారక్.. కొరటాల జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్