తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithya Menon: నిత్య మేనన్‌ను ఆ తమిళ హీరో వేధించాడా.. ఆమె రియాక్షన్ ఇదీ

Nithya Menon: నిత్య మేనన్‌ను ఆ తమిళ హీరో వేధించాడా.. ఆమె రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

09 October 2023, 15:48 IST

google News
    • Nithya Menon: నిత్య మేనన్‌ను ఆ తమిళ హీరో వేధించాడా? గత నెల వచ్చిన ఈ వార్తలపై తాజాగా ఆమె రియాక్టయింది. అయితే ఈ పుకార్లను ఖండించిన ఆమె.. వాటిని వ్యాపింపజేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడింది.
కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్య మేనన్
కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్య మేనన్

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్య మేనన్

Nithya Menon: నిత్య మేనన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ తమిళ హీరో ఆమెను వేధిస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై నిత్య తాజాగా స్పందించింది. ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడింది. అలాంటి వాళ్లు పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే అని వార్నింగ్ ఇవ్వడంతోపాటు ఇలాంటి పుకార్లు తనను నిరాశకు గురి చేయకుండా తానేం చేస్తానో కూడా చెప్పింది.

ఈ మధ్యే నిత్య మేనన్ న్యూస్18తో మాట్లాడింది. ఈ వేధింపుల వార్తలపై ఆమె స్పందించింది. "నన్ను ఎవరో వేధించారని ఎలా చెబుతారు? ఇలాంటి వాళ్లను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను భావించాను. నేను విశ్వసనీయతను విశ్వసిస్తాను. ఎవరైనా వ్యక్తులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే వాళ్ల పని పట్టాల్సిందే. అలాంటి వాళ్లు పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే" అని నిత్య స్పష్టం చేసింది.

ఎవరైనా సరే ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకుంటే ఇలాంటి పుకార్లు మనసుపై ప్రభావం చూపకుండా ఉంటాయని ఆమె చెప్పింది. "ఏది ఏమైనా ఇలాంటివి మనల్ని ప్రభావితం చేయకూడదు. దీనికోసం ఆధ్యాత్మిక చింతన ఉండాలి. లేదంటే నిరాశకు గురవుతాం.

ఇలాంటి విషయాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నాకు నా ఆరోగ్యం ముఖ్యం. ఎవరో ఏదో చేస్తున్నారని నా ఆరోగ్యం పాడు చేసుకోను. ఎవరైనా సరే పరిణతి చెందాలి. ఇలాంటివి పట్టించుకోవద్దని చెబుతుంటారు కానీ అది సాధ్యం కాదు. ఇలాంటి వాటి నుంచి దూరంగా వెళ్లాలంటే వీటిని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. నాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. అభిమానులు వాటిని నమ్ముతారు. నిజంగా జరిగినట్లే రాసేస్తుంటారు. ఈసారి దానిని ప్రశ్నించాలని భావించాను" అని నిత్య చెప్పింది.

గతంలోనూ ఈ వార్త రాసిన ఓ వెబ్‌సైట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ నిత్య ఓ ట్వీట్ చేసింది. "ఓ తమిళ నన్ను వేధించాడు. నేను తమిళ ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను- నిత్య మేనన్" అనే హెడ్‌లైన్ తో ఆ వార్త రాశారు. జర్నలిజం మరీ ఇంత దిగజారడం చూసి బాధగా ఉందనే క్యాప్షన్ తో నిత్య ఈ వార్త షేర్ చేసింది. నిత్య మేనన్ ఈ మధ్యే కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

తదుపరి వ్యాసం