Nithya Menen: నిత్యా మీనన్‍ గురించి ఆ రూమర్స్ నిజం కాదట!-fact check rumors on nithya menen reportedly false ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithya Menen: నిత్యా మీనన్‍ గురించి ఆ రూమర్స్ నిజం కాదట!

Nithya Menen: నిత్యా మీనన్‍ గురించి ఆ రూమర్స్ నిజం కాదట!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 26, 2023 05:45 PM IST

Nithya Menen: తమిళ సినీ ఇండస్ట్రీపై నిత్యా మీనన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా స్పష్టత వచ్చింది.

Nithya Menen: నిత్యా మీనన్‍ గురించి ఆ రూమర్స్ నిజం కాదట!
Nithya Menen: నిత్యా మీనన్‍ గురించి ఆ రూమర్స్ నిజం కాదట! (Twitter)

Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇటీవల చాలా సెలెక్టివ్‍గా సినిమాలు చేస్తున్నారు. బలమైన పాత్ర ఉంటేనే నటించేందుకు అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యా మీనన్ ఓ ఓటీటీ సిరీస్ కూడా చేస్తున్నారు. నిత్య ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుంది. కాగా, ఇటీవల నిత్యా మీనన్ తమిళ సినీ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే, నిత్య ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. ఆ వివరాలివే..

తమిళ సినీ ఇండస్ట్రీలో తాను ఇబ్బందులు ఎదురొన్నానని, ఓ తమిళ యాక్టర్ తనను వేధించాడని నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు రూమర్స్ వచ్చాయి. “తెలుగు సినిమాల్లో నేను ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. కానీ తమిళ సినిమాల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. ఓ చిత్ర షూటింగ్‍లో ఓ తమిళ నటుడు నన్ను వేధించాడు” అని నిత్యామీనన్ అన్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇది కాస్త వివాదంగా మారింది. ఆ తమిళ నటుడు ఎవరు కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, నిత్యా మీనన్ అసలు ఇలాంటి కామెంట్లే చేయలేదని కొందరు తేల్చేశారు.

నిత్యామీనన్ గురించి చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సినీ ఇండస్ట్రీ ఎనలిస్ట్ మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. “నిత్యా మీనన్ గురించి చక్కర్లు కొడుతున్న వార్తలు నిరాధారమైనవి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు” అని విజయ బాలన్ ట్వీట్ చేశారు. అలాగే, మరికొందరు ఎనలిస్టులు కూడా ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు.

నిత్యా మీనన్ తన సినీ కెరీర్లో చాలా గొప్ప క్యారెక్టర్స్ చేశారు. క్లిష్టమైన పాత్రలను కూడా అలవోకగా పోషించి మెప్పించారు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల సినిమాల్లో అలరించారు. టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్నారు.

నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవనుంది. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఏడు ఎపిసోడ్లు ఉండనున్నాయి. వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనే ఉన్నత లక్ష్యం ఉన్న అమ్మాయి పాత్రను కుమారి శ్రీమతి సిరీస్‍లో పోషించారు నిత్య. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం