Kumari Srimathi: “నేను బార్ పెడతా”: నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’ సిరీస్ ట్రైలర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్‍గా..
Kumari Srimathi web series Trailer: నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. వారసత్వంగా తనకు రావాల్సిన ఇంటి కోసం పోరాడుతుంది నిత్య. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
Kumari Srimathi web series Trailer: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. వ్యాపారం చేసి తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్రను ఈ సిరీస్‍లో చేశారు నిత్య. నేడు రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా కుమారి శ్రీమతి సిరీస్ కథను దాదాపు తెలిసిపోయింది. సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తరుణంలో నేడు (సెప్టెంబర్ 22) ట్రైలర్‌ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ట్రైలర్ ఎలా ఉందంటే..
'నీ పేరేంటి' అంటే శ్రీమతి అని చెబుతారు నిత్య. ఎవరి శ్రీమతి అని ఒకాయన అడుగుతారు. తన పేరే కుమారి ఇటికెలపూడి శ్రీమతి అని.. తనకు ఇంకా పెళ్లి కాలేందంటూ నిత్యమీనన్ చెప్పే ఇంట్రెస్టింగ్ డైలాగ్‍తో కుమార్ శ్రీమతి ట్రైలర్ మొదలవుతుంది. పెళ్లి చేసుకునేందుకు తనకు ఇష్టం లేదని కుమారి శ్రీమతి (నిత్య మీనన్) కుటుంబ సభ్యులకు తెగేసి చెబుతుంది. కార్తీక దీపం సీరియల్‍లో డాక్టర్ బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్ పరిటాల ఈ వెబ్ సిరీస్‍లో శ్రీరామ్ అనే కీలకపాత్ర పోషిస్తున్నాడు. కుమారి శ్రీమతితోనే అతడు తిరుగుతుంటాడు. మసూద ఫేమ్ తిరువీర్ కూడా ఈ సిరీస్‍లో ఉన్నారు. వారసత్వంగా తమ ఇళ్లు తిరిగి వచ్చేదాక తాను పెళ్లి చేసుకోనని తన తల్లి (గౌతమి)తో తెగేసి చెబుతుంది కుమారి శ్రీమతి. కోర్టు కేసులో గెలుచుకుంటానని చెబుతుంది. అయితే, తన బాబాయితో పోరాడి ఈ ఇంటిని దక్కించుకునేందుకు ఆరు నెలల్లో రూ.38లక్షలను కుమారి శ్రీమతి సంపాదించాల్సి ఉంటుంది. దీంతో బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. దీంతో అందరూ ఆమెను వ్యతిరేకిస్తారు. అప్పటికే క్యాటరింగ్ బిజినెస్ చేస్తుంటుంది శ్రీమతి.
బార్ ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం తిరుగుతుంటుంది కుమారి శ్రీమతి. “అబ్దుల్ కలాం.. రజినీకాంత్.. ఇటికెలపూడి శ్రీమతి” అని కుమారి శ్రీమతి డైలాగ్ ఉంది. చివరికి శ్రీమతి బార్ పెట్టారా.. ఆ ఇంటిని దక్కించుకున్నారా.. పెళ్లి చేసుకున్నారా అనేదే ఈ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ప్రధాన కథగా ఉంది.
కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‍కు గోమతేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన ఎర్లీ మాన్‍సూన్ టేల్స్, స్వప్నా సినిమాస్ పతాకాలు ఈ సిరీస్‍ను నిర్మించాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ కుమారి శ్రీమతి సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది.
కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‍లో నిత్య, నిరుపమ్, తిరువీర్, గౌతమితో పాటు తాళ్లూరి రామేశ్వర రావు, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్ కీలకపాత్రలు పోషించారు.