NNS 15th September Episode: రణ్‍వీర్‌ను పండుగకు పిలిచిన అంజు.. కంగారులో మనోహరి.. కోల్‍కతాలో బాబ్జీ
15 September 2024, 12:50 IST
- Nindu Noorella Saavasam 15th september Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్‍లో రణ్‍వీర్‌ను అంజు.. పండుగకు రావాలని అడుగుతుంది. దీంతో మనోహరిలో మళ్లీ గుబులు పుడుతుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరగనుందంటే..
NNS 15th September Episode: రణ్‍వీర్‌ను పండుకు పిలిచిన అంజూ.. కంగారులో మనోహరి.. కోల్‍కతాలో బాబ్జీ
జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసం రసవత్తరంగా సాగుతోంది. నేటి ఎపిసోడ్ (సెప్టెంబర్ 15)లో ఏం జరగనుందో ఇక్కడ చూడండి. అమర్ బయటకు వెళ్లిపోతుంటే అడ్డు పడుతుంది భాగీ (మిస్సమ్మ). రొమాంటిక్‌గా చూస్తుంది. సారీ చెప్తుంది. “మన ఇంటికి ఉన్న థ్రెట్ గురించి తెలిసింది. అందుకే మా నాన్నను ఇంటికి రావొద్దన్నారు అని అర్థం అయింది” అని అంటుంది. మనోహరి దగ్గరకు వెళ్లి రణ్‍వీర్ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది అంజు. “రేపు పండగకు అంకుల్‌ను ఇన్వైట్ చేద్దామనుకుంటున్నాను” అని అనగానే మనోహరి వద్దని అంజును తిడుతుంది.
మనోహరి ఇచ్చేలా లేదని రాథోడ్ దగ్గరకు వెళ్లి రణ్‍వీర్ నెంబర్ అడుగుతుంది అంజు. ఎందుకని రాథోడ్ అడగ్గానే మొన్న ఆయన ఇచ్చిన డబ్బులు కొన్ని మిగిలాయని, అవి తిరిగి ఆయనకే మనీఆర్డర్ పంపింద్దామనుకుంటున్నానని చెప్పడంతో రాథోడ్ షాక్ అవుతాడు. అలా పంపించకూడదని చెప్తాడు. గిఫ్టుగా ఇచ్చిన మనీని తిరిగి ఇవ్వకూడదు అంటాడు. ఇంతలో రాథోడ్‌ను అంజు పొగుడుతుంది. దీంతో రాథోడ్ వెంటనే రణ్‍వీర్‌కు ఫోన్ చేసి అంజుకు ఇస్తాడు.
ఎమోషనల్ అయిన రణ్‍వీర్
వినాయక చవితికి ఇంటికి రావాలని రణ్‍వీర్‌తో అంజు చెబుతుంది. దీంతో రణవీర్ ఎమోషనల్ అవుతాడు. “లాయర్.. ఇవన్నీ తీసేయ్. త్వరగా నేను తినేసి పడుకోవాలి” అంటాడు రణ్‍వీర్. “ఒక్కసారి మందు తాగడం మొదలుపెడితే బాటిల్ అయిపోయే వరకు తాగి తాగి అక్కడే పడుకుంటావు. అలాంటిది ఇవాలేంటి? మొదలుపెట్టక ముందే తీసేయ్ అంటున్నావు” అని ఆశ్చర్యపోతాడు లాయర్.
“అంటే నా కూతురు గురించి తెలియక నా బాధని ఆ నషాలో కలిపేసే వాణ్ని. కానీ అంజలితో మాట్లాడాకా మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిద్ర పోవడానికి నాకు ఏ మందు అవసరం లేదనిపిస్తుంది” అని అంటాడు రణ్‍వీర్. “ఇన్ని కోట్ల ఆస్థులు నీకు ఇవ్వలేని ప్రశాంతత ఒక చిన్న పాప వల్ల వచ్చిందంటే ఆ పాపని ఆ కాళికా మాతే నీ జీవితంలోకి పంపించిందేమో” అనగానే సరే నేను వెళ్లి భోజనం చేసి పడుకుంటాను. అని రణవీర్ వెళ్లిపోతాడు.
నిఘా వేస్తున్న అరవింద్
ఉగ్రవాది అరవింద్ తన మనషులతో అమర్ ఇంటి దగ్గరకు వచ్చి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు. బాంబు వేసి అమర్‌ను చంపాలనుకుంటాడు. “రేపు వినాయక చవితి పూజలో వాళ్లింట్లో నేను పెట్టే బాంబు పేలుతుంది” అని చెప్తాడు. మరుసటి రోజు అందరూ త్వరగా లేచి గణపతి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. పిల్లలు రెడీ అయి డల్ గా కూర్చుని ఉంటారు. ఈ సారి అమ్మ లేదని.. అమ్మలా పూజ చేసే వారే లేరని బాధపడుతుంటారు. ఇంతలో భాగీ వచ్చి మీరేం బాధపడకండి మీకందరికీ ఏం కావాలని అడుగుతుంది. దీంతో పిల్లలు భాగీలో ఆరూను చూసుకుంటారు.
మనసులో ఉన్నదెలా తెలిసింది?
మరోవైపు భాగీ రెడీ అవుతుంది. నెక్లెస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ అమర్ చూస్తూ ఉంటే.. అలా గుడ్లు అప్పగించి చూడకపోతే వచ్చి హెల్ఫ్ చేయోచ్చు కదా? అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అమర్ భాగీ దగ్గరకు వస్తాడు. అదే పని నువ్వు చేయకుండా అడగొచ్చు కదా? అంటాడు. “నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసిపోయింది. ఎలా అండి.. ఓ టెలీపతినా..?” అని అంటుది భాగీ. తిరుగు.. అని భాగీకి హెల్ఫ్ చేయబోతూ.. రొమాంటిక్‌గా ఫీలవుతుంటాడు అమర్. భాగీ కూడా రొమాంటిక్ గా ఫీలవుతుంది.
అమర్ వినాయక విగ్రహం తీసుకురావడానికి బయటకు వెళ్లబోతుంటే రాథోడ్ అపుతాడు. “మీ బదులు నేను బయటకు వెళ్తాను. వాడు చాలా ప్రమాదం” అని చెప్పగానే.. అమర్ “నువ్వు ఇప్పటికే మా ఫ్యామిలీకి నువ్వు చాలా హెల్ఫ్ చేశావు. ఇంకా వద్దులే” అని చెప్పి వెళ్లిపోతాడు. బాబ్జీ కోల్‍కతా వెళ్లి అంజు గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. అమర్ ఇంటికి రణ్‍వీర్ వస్తాడా? బాబ్జీకి మనోహరి కూతురు ఆచూకీ తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాలి!