తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nindu Noorella Saavasam: అరుంధతి ఫొటో కోసం భాగీ వెతుకులాట.. ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు.. మనోహరి కొత్త ప్లాన్.. ఆరు రోదన

Nindu Noorella Saavasam: అరుంధతి ఫొటో కోసం భాగీ వెతుకులాట.. ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు.. మనోహరి కొత్త ప్లాన్.. ఆరు రోదన

Sanjiv Kumar HT Telugu

21 October 2024, 6:52 IST

google News
  • Nindu Noorella Saavasam October 21st Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌‌లో అరుంధతి గురించి ఆలోచిస్తుంటుంది భాగీ. పక్కింటావిడా, అరుంధతి ఇద్దరూ ఒక్కటేనా కాదా అని తెలియాలంటే ఫొటో చూడాలని అనుకుంటుంది భాగమతి. మరోవైపు ఆరు ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు చేస్తుంటాడు.

నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌‌

నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం టుడే ఎపిసోడ్‌ (NNS 21st October Episode)లో అంజు పుట్టినరోజుకి తను ఇచ్చిన బహుమతి గురించి అందరూ గుచ్చిగుచ్చి అడగడంతో ఆలోచనలో పడుతుంది భాగీ. అరుంధతి గురించి ఆలోచిస్తున్న భాగీని తిడుతుంది కరుణ. పేరు తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ అక్కా అని పిలిచావా? అంటూ కోప్పడుతుంది.

ఏం మాట్లాడుతున్నావే

ఒసే భాగీ ఎవ్వరికీ కనిపించని నీకు మాత్రమే కనిపించే ఆ అక్క ఎవరు? ఎందుకే ఆమె ఈ ఇంటి చుట్టే తిరుగుతుంది అంటూ కరుణ డౌట్‌ క్రియేట్‌ చేయగానే అరుంధతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది భాగీ. ఇప్పుడు ఎందుకే అట్ల బిగుసుకుపోయినవ్‌.. అంటుంది కరుణ. అది ఆ పక్కింటావిడే.. అరుంధతి అక్కనేమో అని డౌట్‌.. అని భాగీ అనగానే ఏందో ఏం మాట్లాడుతున్నావే నువ్వు.. చనిపోయిన ఆమె ఈ బతికున్న ఆమె ఎట్లైతదే.. అంటుంది కరుణ.

తెలియదే.. కానీ, ఒక్కసారి ఆలోచించు. ఆవిడ ఈవిడ ఒక్కరే అయితే మన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతది కదా? అంటుంది భాగీ. అవును పోరి నువ్వు చెప్తుంటే నాకు కూడా గట్లనే అనిపిస్తుంది అంటుంది కరుణ. కానీ, ఈ విషయం ఎలా కన్ఫమ్ చేసుకోవాలి. అది కన్ఫమ్ అని తెలుసుకునేంత వరకు ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ తెలియకూడదే.. పొద్దునే చూశావు కదే అంజు ఎలా ఏడిసిందో.. అంటుంది భాగీ.

సరే నువ్వు ఒక పని చేయ్‌ నువ్వు ఏదో ఒకటి చేసి ఆ అరుంధతి అక్క ఫోటో చూడు. అప్పుడు ఇద్దరు ఒక్కటేనా కాదో తెలుస్తుంది అని చెప్పి కరుణ వెళ్లిపోతుంది. భాగీ మాత్రం అరుంధతి మాటలు గుర్తు చేసుకుంటుంది. ఎలాగైనా ఇవాళ ఆరు అక్క ఫోటో చూడాల్సిందే అనుకుంటుంది. ఘోరా పూజలు చేస్తుంటాడు. మనోహరి ఎదురుగా కూర్చుని చూస్తుంటుంది. సీసాలో ఉన్న అరుంధతి ఏడుస్తుంది.

గంటల దూరంలో ఉన్న

అబ్బా దీని బాధ చూస్తుంటే జాలిగా ఉంది ఘోరా నాకు త్వరగా ఆత్మను నీ ఆధీనంలోకి తెచ్చుకో.. అంటుంది మనోహరి. నేను అనుకున్న పని చేయడానికి ఒక పూజ దూరంలో ఉన్నాను.. కొన్ని గంటల దూరంలో ఉన్నాను మనోహరి. ఆ ఆత్మ కథ ముగిసిపోతుంది అంటాడు ఘోరా. మీ ఇద్దరికి నేను ఏం అన్యాయం చేశానని ఇలా వేధిస్తున్నారు నన్ను. మను నా ప్రాణాలను తీసేశావు. నేను కలలు కన్న జీవితం కూడా నాకు కాకుండా చేశావు. అయినా ఇంకా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మను అంటుంది ఆరు.

నువ్వు ఏం అంటున్నావో వినిపించదు. కనిపించదు. కానీ, కచ్చితంగా నువ్వు నిస్సహాయంగా ఏడుస్తుంటావు అని తెలుసు అంటుంది మనోహరి. పూజ అయ్యాక నేనే నీకు ఫోన్‌ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్లు అని ఘోరా చెప్తాడు. పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అని మనోహరి అంటే అది గంటల త్వరబడి చేసేది. ఏకాగ్రతతో చేసేది నువ్వు వెళ్లి పడుకో అని చెప్పగానే మనోహరి వెళ్లిపోతుంది.

హాల్లో నిర్మల, శివరాం మాట్లాడుకుంటుంటే.. భాగీ వచ్చి అరుంధతి అక్క ఫోటో ఇస్తారా? అని అడుగుతుంది. వెనకే వచ్చిన మనోహరి షాక్ అవుతుంది. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఫోటో చూడలేదా? అని అడగ్గానే చూశాను. కానీ మళ్లీ చూద్దామని అడుగుతుంది భాగీ. ఈ విషయం అమర్‌‌తో చెప్పొద్దు. ఇందాకే పిల్లుల వచ్చి అరుంధతి ఫోటో అడిగితే ఇచ్చాం. ఇవాళంతా వాళ్ల దగ్గరే పెట్టుకుంటారట అంటాడు శివరామ్.

వదిలేసి వెళ్లవు

ఈ విషయం అమర్‌‌కు తెలియనివ్వకు అమ్మా.. మళ్లీ ఆరు ఫోటో చూసి పిల్లలు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటారని ఆరు ఫోటోను ఇవ్వనివ్వడు అంటుంది నిర్మల. మనసులో ఉన్న వాళ్ల అమ్మని కంటికి కనిపించనంత మాత్రాన మర్చిపోతారా? చెప్పు అంటూ ఎమోషనల్‌ అవుతారు. పిల్లలు ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తుంటారు. అందరూ అమ్మా దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది అన్నారు. కానీ మమ్మల్ని వదిలేసి నువ్వు దేవుడి దగ్గరకు వెళ్లవని నాకు తెలుసమ్మా.. నీ ఆశీర్వాదం తీసుకున్నానమ్మా.. నా బాధ చూసి నాకోసం నువ్వు వచ్చావు కదా..? అంటుంది అంజు.

అమ్మ కళ్లముందు లేకపోతే మనతో లేనట్టేనా..? అమ్మ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది అంటుంది అమ్ము. అవును అంజు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకే బాధగా ఉంది. అమ్మకెలా ఉంటుంది చెప్పు అంటాడు ఆకాష్​. మనం ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉంటేనా కదా? అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అని మాట్లాడుకుంటుంటారు. కింద భాగీ నేను వెళ్లి పిల్లల దగ్గర చూస్తాను అని చెప్పి పైకి వెళ్తుంది.

మనోహరి చూపిస్తుందా

డోర్‌ దగ్గర నుంచి అంతా గమనిస్తున్న మనోహరి ఏదో ఒకటి చేసి భాగీ ఫోటో చూడకుండా చేయాలనుకుని లోపలికి వెళ్తుంది. వెనకాలే మనోహరి వెళ్తుంది. అమర్‌కు చెప్పడం బెటర్‌ అనుకుని రూంలోకి వెళ్తుంది మనోహరి. భాగీ పైకి రూంలోకి వెళ్లగానే పిల్లలు ముగ్గురు పడుకుని ఉంటారు. ఆరు ఫొటో భాగీకి మనోహరి చూపిస్తుందా? ఆరు ఎవరో భాగీకి తెలిసిపోతుందా? అనే ట్విస్టుతో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం