తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 12th Episode: భాగమతిని దొంగగా నిరూపించిన మనోహరి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మిస్సమ్మ​

NNS April 12th Episode: భాగమతిని దొంగగా నిరూపించిన మనోహరి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మిస్సమ్మ​

Sanjiv Kumar HT Telugu

12 April 2024, 11:32 IST

google News
  • Nindu Noorella Saavasam April 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి ఒరిజినల్ నగలు మిస్సమ్మ దగ్గరే ఉన్నాయని, తాను దొంగ అని నిరూపిస్తుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 12th April Episode) రామ్మూర్తి ఇంట్లోంచి ఇప్పుడే ఎందుకొచ్చావని అమర్‌ అడగడంతో ఏం మాట్లాడకుండా ఉంటుంది మనోహరి. దీంతో నాకు మౌనంతో కాదు మాటలతో సమాధానం కావాలని అమర్‌ అడుగుతాడు. చెప్తాను అమర్‌ కానీ ఈ ఇంట్లో ఒకర్ని నాలుగు ప్రశ్నలడిగి ఆ తర్వాత నీకు సమాధానం చెప్తాను అంటుంది మనోహరి.

మెల్లిగా ఒక్కోటి

కోపంగా మిస్సమ్మను పిలుస్తుంది మనోహరి. మిస్సమ్మ వస్తుంది. వావ్‌ మిస్సమ్మ వావ్‌ నీ స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఇంత ఎక్స్‌ పీరియన్స్‌ ఉన్న నాకే అర్థం కావడానికి చాలా టైం పట్టింది అంటుంది మనోహరి. పొగిడినందుకు థాంక్స్‌. కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది మిస్సమ్మ. అర్థం అవుతుంది మిస్సమ్మ.. మెల్లగా ఒక్కోక్కటి అర్థం అవుతుంది. ఫోటో దగ్గర నగలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పింది మిస్సమ్మే కదా? అని మనోహరి అంటుంది.

దానికి మిస్సమ్మ అవును అంటూ నీ దగ్గర ఉన్నవి డూప్లికేట్‌ నగలు అంటూ ప్రూవ్‌ చేయడానికే ఇలా చెప్పానని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దూరం నుంచి చూస్తున్న అరుంధతి ఆయ్యో మనోహరి ప్లాన్‌ ఇంకా మిస్సమ్మకు అర్థం కాలేదని బాధపడుతుంది. నేను ఎలా ఆపగలను అని ఏడుస్తుంది. అసలేం జరిగింది మనోహరి. ఆరు నగలు ఎక్కడున్నాయి. నీ దగ్గరికి ఈ డూప్లికేట్ నగలు ఎందుకొచ్చాయి అని అడుగుతాడు అమర్‌.

మిస్సమ్మ వార్నింగ్

అది అడగాల్సింది నన్ను కాదు అమర్‌. ప్లాన్‌ చేసి పర్ఫెక్టుగా ఎగ్జిక్యూట్‌ చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ నిల్చున్న ఈ మిస్సమ్మని అని మనోహరి చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. నగలకు, మిస్సమ్మకు సంబంధం ఏంటి? అని అమర్‌ అడగ్గానే మిస్సమ్మ, వాళ్ల నాన్న కలిసి అసలు నగలు కొట్టేసి వాటి స్థానంలో డూప్లికేట్‌ నగలు పెట్టారు. అంటూ మిస్సమ్మను వాళ్ల నాన్నను తిడుతుంటే మిస్సమ్మ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది.

అమర్‌ కూడా మిస్సమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మను అంటాడు. అమ్మా మనోహరి ఆరోపణలు చేసే ముందు ఆధారాలుండాలి అంటాడు శివరామ్​. మీకు కావాల్సింది ఆధారాలే కదా? మూసుకున్న మీ కళ్లు తెరుచుకునేలా వీళ్ల మాయలో బయటపడేలా? నిజాన్ని మీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాను రండి అని మిస్సమ్మ రూంలోకి వెళ్లి నగలు ఉన్న బ్యాగ్‌ తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది మనోహరి. దూరం నుంచి చూస్తున్న అరుంధతి బాధపడుతుంది.

డూప్లికేట్ నగలు ఎలా వచ్చాయ్

మనోహరి అందరికీ నగలు చూపిస్తుంది. ఆ నగలు చూసిన శివరాం, నిర్మల ఇవి అరుంధతి నగలే అని అంటారు. మీలో ఎవరికైనా ఇంకా అనుమానం ఉంటే జువెల్లరీ షాపుకు వెళ్లి చెక్‌ చేయిద్దాం అంటుంది మనోహరి. మనోహరి గారు నా మీద దొంగ అనే ముద్ర వేయాలని చూడకండి. ఈ నగలు తీసుకునే అవసరం నాకు లేదు అంటుంది మిస్సమ్మ. నువ్వు తీసుకురాకుండా నువ్వు చేంజ్‌ చేయకుండా డూప్లికేట్‌ నగలు నా దగ్గరకు ఎలా వచ్చాయి. వర్జినల్‌ నగలు నీ రూంలోకి ఎలా వచ్చాయి అంటుంది మనోహరి.

ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు అంటున్న మిస్సమ్మతో అవునా నగలు నీ రూంలో ఉన్నాయని నీకు తెలుసా? లేదా? అంటుంది మనోహరి. తెలుసు కానీ ఎలా వచ్చాయో తెలియదు అంటుంది మిస్సమ్మ. విన్నావా అమర్‌ ఉన్నాయని తెలుసట. కానీ ఎలా వచ్చాయో తెలియదట అంటూ నువ్విదంతా ఎందుకు చేశావంటే నువ్వు ఈ పెళ్లి అపాలనుకున్నావు కాబట్టి ఈ తతంగం అంతా నడిపించావు అంటుంది మనోహరి.

ప్రళయం ముంచుకొస్తుందంటే

అమర్‌ ఈ మిస్సమ్మను వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పు అంటుంది. దీంతో మిస్సమ్మ సార్‌ నేను అని అంటుండగా అమర్‌ తప్పు చేశావు మిస్సమ్మ. నీకు ముందే చెప్పాను నాకు అబద్దం అంటే నచ్చదని అంటాడు. దానికి మిస్సమ్మ తానే వెళ్లిపోతానని అంటుంది. నీలాంటి మోసగాళ్లు, దొంగలు ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అంటుంది మనోహరి.

గుప్త గారు ప్రళయం ముంచుకొస్తుంది. ప్రమాదం మనోహరి రూపంలో వస్తుంది అంటే నాకు అర్థం కాలేదు. నేనే ప్రళయాన్ని సృష్టించడానికి ఒక అవకాశం ఇస్తాననుకోలేదు అని అరుంధతి అంటుంది. దానికి గుప్త కోపంగా నేను ముందే చెప్పాను కదా. ఆ బాలికకు శక్తుల తోడవుతున్నాయి అనగానే ఇప్పుడే వెళ్లి మిస్సమ్మకు నిజం ఎంటో చెప్పేస్తాను అంటుంది. నువ్వు ఇచ్చిన మాట తప్పిన వెంటనే నిన్ను ఈ లోకం నుంచి మా లోకం తీసుకెళ్తాను అని గుప్త చెప్పగానే అరుంధతి షాకవుతుంది.

ఎలా తెలుస్తుంది

దొంగతనం నింద నుంచి మిస్సమ్మ ఎలా బయటపడుతుంది? మనోహరి అసలు దొంగ అని అందరికీ ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం