NNS December 23rd Episode: మనోహరి ఓవరాక్షన్ - ఆరుకు డెడ్‌లైన్ పెట్టిన గుప్త - అమర్‌తో మిస్సమ్మ రొమాన్స్
23 December 2024, 6:07 IST
NNS Serial: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో మిస్సమ్మ తన చెల్లి అని, ఆమె జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తానని మనోహరికి ఆరు వార్నింగ్ ఇస్తుంది. ఆరు వార్నింగ్‌ను మనోహరి పట్టించుకోదు. మిస్సమ్మను చంపేసి అమర్‌ను పెళ్లి చేసుకొని తీరుతానని ఆరుతో ఛాలెంజ్ చేస్తుంది మనోహరి.
నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 23 ఎపిసోడ్
NNS December 23rd Episode: మిస్సమ్మను మనోహరి చంపాలని ప్రయత్నిస్తోన్న విషయం ఆరుకి తెలిసికోపంతో రగిలిపోతుంది. మను అని ఆరు కోపంగా పిలవడంతో మనోహరి భయంతో ఆగిపోతుంది.
దగ్గరకు వెళ్లిన ఆరు ఎంత నీచానికి దిగజారావు మను. మిస్సమ్మనే చంపాలనుకుంటావా..? మిస్సమ్మ నా చెల్లి మను. మిస్సమ్మ జోలికి వస్తే నిన్ను చంపేస్తాను అంటూ మనోహరికి ఆరు వార్నింగ్ ఇస్తుంది.
చెల్లిలా ఫీలవుతున్నావు...
ఏంటే దాన్ని చంపాలని చూస్తున్నందుకు నీకు బాగా కోపం వచ్చినట్టు ఉంది. అయినా నిన్ను చంపినందుకు నన్ను తిట్టు నేను పడతాను. దాన్ని చంపితే నీకేంటి..? అది నీ అక్కా నీ చెల్లా..అమర్‌ను పెళ్లి చేసుకుందని నీ చెల్లిలా ఫీల్ అవుతున్నావా..? ఏంటి..
నువ్వు అనాథగా పుట్టావు అనాథగానే చచ్చావు. అనాథగానే మిగిలిపోతావు. అది మిస్ అయిపోయిందని తెగ ఆనంద పడిపోతున్నట్లున్నావు. ఆ ఆనందం నీకు ఎక్కువ సేపు ఉంచనీయనే.. దాన్ని చంపడానికి మరెవరి మీదో ఆధారపడటం లేదు. దాన్ని చంపడానికి ఈసారి నేనే రంగంలోకి దిగుతాను. దాన్ని చంపేసి.. అమర్‌ను పెళ్లి చేసుకుంటాను. అది నువ్వు చూస్తావు సిద్దంగా ఉండు అని ఆరుతో చెప్పి మనోహరి వెళ్లిపోతుంది.
ప్రమాదం పొంచి ఉంది…
శివరాం టాబ్లెట్స్ వేసుకోకుండా ఆలోచిస్తుంటే నిర్మల వచ్చి ఏవండి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అమర్ , మిస్సమ్మ తో పాటు పిల్లల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు శివరాం. ఇప్పుడు ఏం అయిందండి అందరూ క్షేమంగానే ఉన్నారు కదా..? అని నిర్మల అడగ్గానే ఇప్పుడు ఉన్నారు కానీ నాకెందుకో ప్రమాదం వాళ్ల వెంటే తిరుగుతుంది అనిపిస్తుందని శివరాం బదులిస్తాడు.
అరుంధతి చావు దగ్గర నుంచి ఇంట్లో ప్రతిసారి ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతూనే ఉందని శివరాం భయపడతాడు. దీంతో నిర్మల మీరు అనవసరంగా కంగారు పడుతున్నారని భర్తకు సర్ధిచెబుతుంది. .
కానీ అదే ప్రమాదం మళ్లీ ఎదురైతే ప్రతిసారి అదృష్టం మనవైపే ఉంటుందని అనుకోలేం శివరాం అంటాడు. అయితే ఒకసారి స్వామిజీని పిలిపించి ఏవైనా దోషాలు ఉన్నాయేమో తెలుసుకుందాం అని నిర్మల చెప్తుంది.
కిస్ సీన్...
అమర్ బాల్కనీలో నిలబడి ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. కింద గార్డెన్‌లో నిలబడి ఆరు చూస్తుంది. ఇంతలో రాథోడ్, మిస్సమ్మ పేపర్ తీసుకుని అమర్ దగ్గరకు వస్తారు. మిస్సమ్మను చూసిన ఆరు చాటుకు వెళ్లి దాక్కుంటుంది. అమర్ మాత్రం రాత్రి జరిగిన కిస్ సీన్ గుర్తు చేసుకుంటాడు.
అమర్ రెస్ట్...
ఇంతలో మిస్సమ్మ డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమంటే ఇలా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారేంటి..? అని అమర్‌ను అడుగుతుంది. డాక్టర్ గారు హ్యాండ్ ఎక్సర్ సైజ్ చేయమన్నారు అని భార్యకు సమాధానమిస్తాడు అమర్. బాగా చెప్పావు అమర్ అనుకుంటూ మనోహరి వస్తుంది.
ఇవన్నీ మిస్సమ్మకు ఏం తెలుసు పప్పులో ఉప్పు వేయడం కూరలో కారం వేయడం లాంటివి అయితే బాగా తెలుస్తుంది అంటూ ఇందాక తెలిసిన డాక్టర్‌తో మాట్లాడాను అమర్ నీ గురించి చెప్పాను. తను కొన్ని ఎక్సర్ సైజులు చెప్పారు అంటూ వెళ్లి అమర్‌ను పట్టుకుని ఎక్సర్ సైజ్ చేయిస్తుంది మనోహరి.
మనోహరి ఓవర్‌యాక్షన్..
మిస్సమ్మ కోపంగా బాగా ఓవర్ చేస్తుంది రాథోడ్ అంటూ తిడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఆవిడ ఇలాగే ఓవర్ చేస్తూ సార్‌ను ఎగేసుకుని పోతుంది వెళ్లు మిస్సమ్మ నువ్వు వెళ్లి విజృంభించు అని రాథోడ్ చెప్పగానే మిస్సమ్మ కోపంగా మనోహరి అంటూ పిలవడంతో అమర్, మనోహరి ఉలిక్కిపడతారు.
నీకు వచ్చింది చేయడం కాదు.. ఆయనకు నొప్పి రాకుండా చూడాలి అని అమర్ దగ్గరకు వెళ్లి ఎక్సర్ సైజ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను అని మిస్సమ్మ రొమాంటిక్‌గా ఎక్సర్ సైజ్ చేయిస్తుంది.
దీంతో రాథోడ్ నవ్వుతూ ఏంటి మేడం ఎక్కడో ఏదో కాలినట్టు అనిపిస్తుంది అని మనోహరిని అడగ్గానే మనోహరి రాథోడ్‌ను తిడుతుంది. ఇంతలో రాథోడ్ సార్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అని చెప్పగానే సరే వెళ్దాం పదండి అని మిస్సమ్మ చెప్పగానే అమర్ లోపలికి వెళ్లిపోతాడు.
రెండు రోజులు డెడ్‌లైన్...
కింద నుంచి అంతా గమనించిన ఆరు కోపంగా గార్డెన్‌లోకి వెళ్లి గుప్త ఎక్కడ అని చూస్తుంది. ఇంతలో గుప్త వస్తాడు. ఆరును కోపంగా తిడతాడు. తన మాటలతో ఆరు గుప్తను కూల్ చేయబోతుంటే..
రెండు దినములలో నువ్వే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లెదవు బాలిక అని చెప్తాడు గుప్త. నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు ఇక్కడి నుంచి పంపిస్తారు అని అడుగుతుంది. అంతయూ దైవేచ్చ అని గుప్త చెప్తాడు. ఇంతలో ఇంటికి స్వామిజీ వస్తాడు. గార్డెన్‌లో ఆరు నిలబడి ఉండటం చూస్తాడు.
స్వామిజీ ఎంట్రీ...
ఆరును చూస్తూనే లోపలికి వెళ్తుంటాడు. ఆరు కూడా స్వామిజీకి ఎదురుగా నడుస్తుంది. ఇంతలో శివరాం, నిర్మల, రాథోడ్ ఎదురుగా వచ్చి స్వామిజీని లోపలికి తీసుకెళ్తారు. వెంటనే ఆరు కంగారుగా గుప్త గారు ఆ స్వామిజీ ఏంటి నన్ను అలా చూస్తున్నారు కొంపదీసి నేను ఆయనకు కనిపిస్తున్నానా..? అని అడుగుతుంది.
ఆయనకు తెలిసింది అని గుప్త చెప్తాడు. ఆయనకు ఎలా తెలిసింది అని ఆరు అడుగుతుంది. అమర్ ఆరు ఆత్మ గురించిన నిజం తెలుసుకుంటాడా? మనోహరి అమర్‌కి దగ్గరయ్యేందుకు ఏం చేయబోతోంది? అన్నది తెలియాలంటే డిసెంబర్ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే!