Niharika Konidela: రెండో పెళ్లి చేసుకుంటానన్న నిహారిక కొణిదెల.. ఈసారి లవ్ మ్యారేజ్!
14 March 2024, 16:20 IST
Niharika Konidela About Second Marriage: మెగా డాటర్ నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకోవాలని ఉందని తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. సాగు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక కొణిదెల లవ్ మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చింది.
రెండో పెళ్లి చేసుకుంటానన్న నిహారిక కొణిదెల.. ఈసారి లవ్ మ్యారేజ్!
Niharika Konidela Second Marriage: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది నిహారిక కొణిదెల. ఢీ షో వంటి పలు కార్యక్రమాలతో బుల్లితెరపై సందడి చేసిన నిహారిక ఒక మనసు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాలు, యూట్యూబ్ సిరీసులు చేసింది. అయితే చైతన్య జొన్నలగడ్డను అరెంజ్ మ్యారేజ్ చేసుకున్న నిహారిక తర్వాత సినిమాలు ఆపేసింది. ఇక చైతన్యతో విడాకుల తర్వాత మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసింది.
పిల్లలు అంటే ఇష్టం
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో అనేక్ ఓటీటీ వెబ్ సిరీసులు నిర్మించింది. ఇటీవలే డెడ్ ఫిక్సెల్ అనే సిరీసుతో యాక్టింగ్‌లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్‌గా చేస్తున్న నిహారిక కొణిదెల సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజంటర్‌గా వ్యవహరించింది. సాగు మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. సాగు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నిహారిక కొణిదెల. ఇందులో తనకు పిల్లలు అంటే ఇష్టమని చెప్పింది నిహారిక.
నెగెటివ్ ఇంప్రెషన్ లేదు
పిల్లలంటే ఇష్టమని నిహారిక చెప్పడంతో "లైఫ్ అనేది ఒక సైకిల్. అదే సాగులో చూపించారని చెబుతున్నారు. మరి మళ్లీ నిహారికను పెళ్లి కూతురిగా చూడొచ్చా?" అని యాంకర్ అడిగారు. దానికి "అమ్మో.." అని రియాక్షన్ ఇచ్చిన నిహారిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "తెలీదండి. అంటే డెఫినెట్‌గా పిల్లలు కావాలని అంటున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి. దానికోసం అనే కాదండి. లవ్ మీద నాకు నెగెటివ్ ఇంప్రెషన్ అయితే లేదు" అని నిహారిక కొణిదెల చెప్పింది.
అలా అనుకోవడం మూర్ఖత్వం
"ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదంటే.. చాలా మంది అంటారు. ఎందుకు రిలేషన్‌షిప్ ఎందుకు వర్కౌట్ కాలేదు ఒక్క కారణం చెప్పమని. ఒక్క రీజన్‌తో ఎవరు విడిపోరు. చాలా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాలేదు. అలా అని మళ్లీ లవ్ రాదు. ఒక మనిషి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వం. సో కచ్చితంగా హోప్‌ఫుల్లీ పెళ్లి చేసుకుంటానేమో. కానీ, త్వరలో అయితే కాదు. కానీ, పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటాను" అన్న అర్థంలో నిహారిక కొణిదెల నవ్వుతూ తెలిపింది.
ఎవరైనా మంచిగా ఉంటే
"ఇంతకుముందు అరెంజ్ మ్యారేజ్ కదా. మరి ఈసారి లవ్ మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా" అని యాంకర్ అడిగారు. నేనే ఆలోచించుకోవట్లేదు. మీరు నన్ను స్పాట్‌లో కూర్చొబెట్టి ఫాస్ట్‌గా చెప్పు.. లవ్ మ్యారేజా.. అరెంజ్ మ్యారేజా అంటే ఏం చెప్పను. అదే నేను చెప్పినట్లుగా.. ఇంట్లో వాళ్లకి అయితే నచ్చకుండా ఏది ఉండదు. కానీ, ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అయితే వర్క్‌పై దృష్టి పెట్టాను. దాని గురించి కూర్చోని అంతగా ఆలోచించలేదు. ఏమైనా గానీ ఎవరైనా మంచిగా అనిపిస్తే ఉండొచ్చు" అని నిహారిక కొణిదెలా క్లారిటీ ఇచ్చింది.
పెద్ద.. నాన్న కూచీని
"మీరు చెప్పారు ప్రతి స్టెప్పులో మా నాన్నగారి సపోర్ట్ ఎంతో ఉందని అన్నారు. మిమ్మల్ని నాన్న కూచి అనుకొవచ్చా" అని యాంకర్ అడిగారు. మాములు నాన్న కూచి కాదు. పెద్ద నాన్న కూచి. మా అమ్మకు కోపం వచ్చేంత నాన్న కూచిని. మీ అబ్బా కూతుళ్లు ఉన్నారే.. అబ్బా కూతుళ్లు ఉన్నారే అని అమ్మ అంటుంది" అని నిహారిక కొణిదెల తెలిపింది.