తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: నెట్‍ఫ్లిక్స్‌లో స్పెషల్ వస్తోందంటూ షారుఖ్ ఖాన్ వీడియో.. ఆ సినిమా స్ట్రీమింగ్ గురించే!

OTT: నెట్‍ఫ్లిక్స్‌లో స్పెషల్ వస్తోందంటూ షారుఖ్ ఖాన్ వీడియో.. ఆ సినిమా స్ట్రీమింగ్ గురించే!

14 February 2024, 20:53 IST

    • OTT - Shah Rukh Khan: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి సమ్‍థింగ్ స్పెషల్ వచ్చేస్తోందంటూ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చెప్పారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ వీడియో రిలీజ్ చేసింది.
OTT: నెట్‍ఫ్లిక్స్‌లో స్పెషల్ వస్తోందంటూ షారుఖ్ ఖాన్ వీడియో.. ఆ సినిమా స్ట్రీమింగ్ గురించే!
OTT: నెట్‍ఫ్లిక్స్‌లో స్పెషల్ వస్తోందంటూ షారుఖ్ ఖాన్ వీడియో.. ఆ సినిమా స్ట్రీమింగ్ గురించే! (PTI)

OTT: నెట్‍ఫ్లిక్స్‌లో స్పెషల్ వస్తోందంటూ షారుఖ్ ఖాన్ వీడియో.. ఆ సినిమా స్ట్రీమింగ్ గురించే!

OTT: బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్‍కు గతేడాది బాగా కలిసి వచ్చింది. ఆయన హీరోగా నటించిన పఠాన్, జవాన్, డంకీ గత సంవత్సరమే థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. పఠాన్, జవాన్ చిత్రాలు భారీ బ్లాక్‍బాస్టర్ అయ్యాయి. రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపాయి. చాలా కాలంగా హిట్ కోసం వేచిచూస్తున్న షారుఖ్‍కు 2023 బ్లాక్‍బాస్టర్ కరువు తీర్చేసింది. కామెడీ ఎమోషనల్ మూవీగా వచ్చిన డంకీ ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయింది. అయితే, డంకీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14).. షారుఖ్ ఖాన్ మాట్లాడిన వీడియోను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇన్‍స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసింది. “ఫిబ్రవరి 14న ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని వచ్చేశా. నెట్‍ఫ్లిక్స్‌లో ఏదో స్పెషల్‍గా వస్తోంది. త్వరలో కలుద్దాం” అని షారుఖ్ ఖాన్ ఆ వీడియోలో చెప్పారు.

డంకీ స్ట్రీమింగ్ గురించే..

డంకీ స్ట్రీమింగ్ త్వరలో ఉంటుందనే హింట్ ఇచ్చేందుకే నెట్‍ఫ్లిక్స్ ఈ వీడియో పోస్ట్ చేసినట్టు అర్థమవుతోంది. డంకీ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని కొంతకాలంగా అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నెట్‍‍ఫ్లిక్స్ ఈ హింట్ ఇచ్చింది.

డంకీ సినిమా ఓటీటీ హక్కులను జియోసినిమా కూడా దక్కించుకుందనే టాక్ ఆరంభంలో వినిపించింది. అయితే, డంకీ చిత్రం రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో వస్తుందా.. నెట్‍ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుందా అనేది చూడాలి.

డంకీ చిత్రానికి స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. విదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించే డాంకీ ఫైట్ టెక్నిక్ అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో షారుఖ్‍తో పాటు తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, జ్యోతి సుభాష్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, శేఖర్ రావ్‍జానీ, అమన్ పంత్ సంగీతం అందించారు.

డంకీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.470 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, పఠాన్, జవాన్‍తో పోలిస్తే ఇది తక్కువే. ప్రభాస్ మూవీ సలార్ పోటీలో ఉండడం కూడా ఈ సినిమా వసూళ్లపై దెబ్బపడింది. డంకీ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం కూడా ప్రతికూలంగా మారింది.

జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీ ఖాన్, జ్యోతి దేశ్‍పాండే, గౌరవ్ వర్మ, రాజ్ కుమార్ హిరానీ సంయుక్తంగా డంకీ మూవీని నిర్మించారు.

డంకీ స్టోరీ లైన్ ఇదే…

పంజాబ్‍లోని ఓ గ్రామానికి చెందిన మనూ (తాప్సీ), బాలి (అనిల్ గ్రోవర్), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు లోఖ్‍న్‍పాల్ (విక్రమ్ కొచ్చర్) వివిధ కారణాలతో బ్రిటన్‍కు వెళ్లాలని అనుకుంటారు. అయితే, ఇందుకోసం ఇంగ్లిష్ నేర్చుకోలేకపోతారు. దీంతో మాజీ సైనికుడు హార్డీ (షారుఖ్ ఖాన్) వారికి సాయం చేస్తాడు. డాంకీ ఫైట్ పద్ధతిలో అక్రమంగా దేశాల సరిహద్దు దాటేందుకు దిశానిర్దేశం చేస్తాడు. అయితే వారు లండన్‍కు వెళ్లే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? గమ్యానికి చేరుకున్నారా? అనేది డంకీ మూవీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం