Chiranjeevi Dance: షారుఖ్ ఖాన్ పాటకు చిందేసిన చిరంజీవి: వైరల్ అవుతున్న వీడియో
Chiranjeevi Dance: జవాన్ పాటకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi Dance: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల ఇటీవల దీపావళి సందర్భంగా తమ ఇంట్లో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేశ్, నాగార్జున సహా మరికొందరు టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ సెలెబ్రేషన్ గ్రాండ్‍గా జరిగింది. ఈ దీపావళి పార్టీలో మెగాస్టార్ చిరంజీవి చిందేసిన వీడియో తాజాగా బయటికి వచ్చింది.
దీపావళి పార్టీలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ హైలైట్‍గా నిలిచింది. డ్యాన్స్ చేయాలంటూ తండ్రి చిరూను స్టేజీపైకి పిలిచారు రామ్ చరణ్. ఆ తర్వాత.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలోని టైటిల్ సాంగ్‍కు చిరంజీవి సూపర్ స్టెప్స్ వేశారు. తన మార్క్ గ్రేస్ స్టెప్‍లతో అదరగొట్టారు. సింగర్ రాజకుమారి పాట పాడుతుండగా.. మెగాస్టార్ అదిరిపోయే డ్యాన్స్ చేశారు.
షారుఖ్ ఖాన్ పాటకు మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరూ గ్రేస్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవర్‌గ్రీన్ స్టార్ అంటూ సంబరపడుతున్నారు.
దీపావళి పార్టీలో రామ్‍చరణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్ కలిసి ఫొటో దిగారు. ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‍లో చూసి అభిమానులు చాలా సంతోషపడ్డారు. అలాగే, మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్, ఎన్టీఆర్ భార్య ప్రణతి, అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా ఈ దీపావళి పార్టీకి వచ్చారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
కాగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి తన 156వ సినిమా చేయనున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సోషయో ఫ్యాంటసీ మూవీ రూపొందనుంది. డిసెంబర్‌లో ఈ మూవీ షూటింగ్‍లో చిరూ పాల్గొననున్నారని తెలుస్తోంది. మెగా156 చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
సంబంధిత కథనం