తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nbk108 Starts: గ్రాండ్‌గా లాంచ్‌ అయిన బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి మూవీ

NBK108 Starts: గ్రాండ్‌గా లాంచ్‌ అయిన బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి మూవీ

HT Telugu Desk HT Telugu

08 December 2022, 21:01 IST

    • NBK108 Starts: గ్రాండ్‌గా లాంచ్‌ అయింది బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి మూవీ. బాలయ్య కెరీర్‌లో 108వ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రస్తుతానికి ఎన్‌బీకే108గా ఈ మూవీని పిలుస్తున్నారు.
ఎన్‌బీకే108 మూవీ లాంచ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి
ఎన్‌బీకే108 మూవీ లాంచ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి

ఎన్‌బీకే108 మూవీ లాంచ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి

NBK108 Starts: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరించనుంది. గోపీచంద్‌ మలినేనితో వీర సింహారెడ్డి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు అనిల్‌ రావిపూడితో కలిసి కితకితలు పెట్టడానికి వస్తున్నాడు. ఎన్‌బీకే108 మూవీ గురువారం (డిసెంబర్‌ 8) గ్రాండ్‌గా లాంచ్‌ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ కింద సాహు గారాపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

పూజా కార్యక్రమాలతో ఈ ఎన్‌బీకే108 లాంచ్‌ అయింది. ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టాడు. ఇక మరో స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు కెమెరా స్విఛాన్‌ చేవాడు. ఈ షాట్‌కు లెజెండరీ డైరెక్టర్‌ రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్‌ ఎర్నేని, కిలారు సతీష్‌, ప్రొడ్యూసర్‌ శిరీష్‌లు స్క్రిప్ట్‌న మేకర్స్‌కు అందించారు.

గురువారం నుంచే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఓ యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరించారు. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ మూవీలో బాలకృష్ణ ఓ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. తొలిసారి బాలయ్య బాబు ఇలాంటి లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌తోపాటు అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ కూడా ఎన్‌బీకే 108లో ఉండనుంది. బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని అనిల్‌ రావిపూడి ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని రాసుకున్నాడు. శ్రీలీల ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. తమన్‌ మూడోసారి బాలయ్య సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.