Raa Raa Penimiti OTT: 9 నెలలకు ఓటీటీలోకి వచ్చేసిన సింగిల్ రోల్ తెలుగు మూవీ.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
29 January 2024, 10:25 IST
Nandita Swetha Raa Penimiti OTT Streaming: టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత ఒక్కరు మాత్రమే నటించిన తెలుగు మూవీ రారా పెనిమిటి. గతేడాది విడుదలైన రారా పెనిమిటి సినిమా ఎట్టకేలకు 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఓటీటీల్లో రారా పెనిమిటి స్ట్రీమింగ్ అవుతోంది.
9 నెలలకు ఓటీటీలోకి వచ్చేసిన సింగిల్ రోల్ తెలుగు మూవీ.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
Raa Raa Penimiti OTT Release: ఈ మధ్య ఓటీటీల్లోకి కొన్ని సినిమాలు వెంటనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో విడుదలైన నాలుగు లేదా మూడు వారాల్లో ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. కానీ, కొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఎంతో సమయం తీసుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో తెలుగు మూవీ రారా పెనిమిటి ఒకటి. టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన రారా పెనిమిటి మూవీ 9 నెలలకు ఓటీటీలోకి వచ్చేసింది.
నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బ్యూటిఫుల్ నందితా శ్వేత. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. అనంతరం శ్రీనివాస కల్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన కల్కి, కపటధారి, అక్షర, జెట్టి వంటి చిత్రాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాల్లో సైతం అలరించింది నందితా శ్వేత. అంతేకాకుండా దబాంగ్ 3లో సోనాక్షి సిన్హా పాత్రకు డబ్బింగ్ సైతం చెప్పింది నందితా.
అలాంటి నందితా శ్వేత నటించిన మూవీనే రారా పెనిమిటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ మూవీలోని పెనిమిటి పాటలోని హుక్ లైన్ రారా పెనిమిటిని టైటిల్‌గా ఈ సినిమాకు తీసుకున్నారు. రారా పెనిమిటి మూవీలో నందితా శ్వేత ఒక్కరే నటించారు. సింగిల్ రోల్‌తో తెరకెక్కిన రారా పెనిమిటికి సత్య వెంకట గెద్దాడా దర్శకత్వం వహించారు. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రమీల గెద్దాడ నిర్మాతగా వ్యవహరించారు.
రారా పెనిమిటి సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం విశేషం. రామ్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, నీలకంఠ రావు పాటలు రచయితగా, హరిణి ఇవటూరి గేయనిగా చేశారు. ఇక 2023 సంవత్సరంలో ఏప్రిల్ 28న విడుదలైన రారా పెనిమిటి సినిమాకు పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమా వచ్చింది వెళ్లింది అప్పట్లో ఎవరికీ అంతగా తెలియదు. ఇలాంటి సినిమా ఒకటి ఉందనే విషయం కూడా మర్చిపోయి ఉంటారు.
ఇలాంటి సమయంలో రారా పెనిమిటి ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. అయితే, రారా పెనిమిటి మూవీ ఓటీటీలో ఎప్పటి నుంచే ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రారా పెనిమిటి చాలా రోజుల నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అది కేవలం ఇతర దేశాల వాళ్లు మాత్రమే చూసే వీలు కల్పించారు. అంటే భారతీయులకు చూసే అవకాశం లేకుండా రారా పెనిమిటి స్ట్రీమింగ్ అవుతూ వస్తోంది. కానీ, తాజాగా తెలుగు ప్రేక్షకులు కూడా చూసేలా ఓటీటీలోకి వచ్చేసింది రారా పెనిమిటి చిత్రం.
ప్రస్తుతం రారా పెనిమిటి మూవీ రెండు డిఫరెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హంగామా ప్లే, గ్యాలక్సీ అనే రెండు ఓటీటీల్లో రారా పెనిమిటి సందడి చేస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు ఓటీటీలను వాడే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి ఈ ఓటీటీలు ఉన్నాయా అనే అనుమానం కూడా చాలమంది తెలుగు సినీ ప్రేక్షకులకు రావొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీలు కాకుండా హంగామా ప్లే, గ్యాలక్సీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నందితా శ్వేత రారా పెనిమిటి స్ట్రీమింగ్ అవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పవచ్చు.