Nandita Swetha Jetty Movie: నందితా శ్వేత డ‌బుల్ ధ‌మాకా - ఒకే రోజు ఓటీటీలో జెట్టి థియేట‌ర్‌లో మంగ‌ళ‌వారం రిలీజ్‌-nandita swetha jetty movie streaming now on aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nandita Swetha Jetty Movie: నందితా శ్వేత డ‌బుల్ ధ‌మాకా - ఒకే రోజు ఓటీటీలో జెట్టి థియేట‌ర్‌లో మంగ‌ళ‌వారం రిలీజ్‌

Nandita Swetha Jetty Movie: నందితా శ్వేత డ‌బుల్ ధ‌మాకా - ఒకే రోజు ఓటీటీలో జెట్టి థియేట‌ర్‌లో మంగ‌ళ‌వారం రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 17, 2023 10:49 AM IST

Nandita Swetha Jetty Movie: ఒకే రోజు అటు ఓటీటీ, ఇటు థియేట‌ర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది నందితా శ్వేత‌. ఆమె హీరోయిన్‌గా జెట్టి సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ కాగా...మంగ‌ళ‌వారం మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

నందితా శ్వేత‌  జెట్టి
నందితా శ్వేత‌ జెట్టి

Nandita Swetha Jetty Movie: నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఓ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా...మ‌రో సినిమా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టించిన జెట్టి మూవీ శుక్రవారం (నేడు) ఆహా ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన మంగ‌ళ‌వారం సినిమాలో నందితా శ్వేత పోలీస్ ఆఫీస‌ర్‌గా కీల‌క పాత్ర పోషించింది.

మ‌త్య్స‌కారుల జీవితాల నేప‌థ్యంలో జెట్టి సినిమా రూపొందింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జెట్టి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో త్రివిక్ర‌మ్‌, బాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు స్టార్స్ పాల్గొన్నారు. దాంతో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో రిలీజైన ఈ సినిమా ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

జెట్టి సినిమాలో మానినేని కృష్ణ హీరోగా న‌టించాడు. మ‌రోవైపు పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో శుక్ర‌వారం రిలీజైన మంగ‌ళ‌వారం సినిమాలో నందితా శ్వేత కీల‌క పాత్ర పోషించింది. ఊరిలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని ఛేదించే పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించింది.

ఎక్క‌డికి పోతావు చిన్నావాడా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నందితా శ్వేత‌. క‌ల్కి, శ్రీనివాస క‌ళ్యాణం, బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, హిడింబ‌తో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. అవ‌కాశాలు భారీగానే అందుకున్నా అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. ఆమె న‌టించిన సినిమాలు చాలా వ‌ర‌కు ప‌రాజ‌యాలుగానే మిగిలాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్