Nandamuri Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా జానర్ ఇదే! భారీస్థాయిలో ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ
29 July 2024, 14:58 IST
- Nandamuri Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తేజ తొలి సినిమా గురించి మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం ఓ జానర్‌లో ఉంటుందో వెల్లడైంది.
Nandamuri Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా జానర్ ఇదే! భారీస్థాయిలో ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం కోసం అభిమానులందరూ నిరీక్షిస్తున్నారు. మోక్షజ్ఞ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని వేచిచూస్తున్నారు. హనుమాన్ చిత్రంతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మోక్షజ్ఞ తొలి మూవీ చేయనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే హైప్ చాలా క్రియేట్ అయింది. అయితే, ఈ చిత్రం ఏ జానర్‌లో ఉండనుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
జానర్ ఇదే..
నందమూరి మోక్షజ్ఞతో సోషియో ఫ్యాంటసీ జానర్‌లో చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు పురాణాలతో సంబంధం ఉంటుందని సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ కథను ప్రశాంత్ వర్మ రాసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూపర్ హీరోగా మోక్షజ్ఞ నటించనున్నారని సినీ సర్కిళ్లలో సమాచారం చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం నందమూరి మోక్షజ్ఞ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని భారీస్థాయిలో తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నారట. హనుమాన్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో గుర్తింపు రావటంతో ఈ మూవీని కూడా అదే స్థాయిలో రూపొందించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. దీంతో చాలా విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పూజా కార్యక్రమం తేదీ!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ సినిమా పూజా కార్యక్రమానికి కూడా ఇప్పటికే డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ పుట్టిన రోజైన సెప్టెంబర్ 6న తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని టాక్. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం. మొత్తంగా మోక్షజ్ఞ ఎంట్రీ భారీగానే ఉండనుందని అర్థమవుతోంది.
హనుమాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ ఈ ఏడాది భారీ బ్లాక్‍బాస్టర్ సాధించారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో సక్సెస్ అయింది. ప్రశాంత్ పాపులర్ అయ్యారు. సూపర్ హీరో హనుమాన్ మూవీ కూడా పురాణాల స్ఫూర్తితోనే వచ్చింది. హనుమంతుడి స్ఫూర్తితో ఈ చిత్రం మూవీ తెరకెక్కింది. హనుమాన్ మూవీ మొత్తంగా రూ.350కోట్ల కలెక్షన్లను సాధించింది.
బాలీవుడ్ హీరో రణ్‍వీర్ సింగ్‍తో ఓ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదలుపెట్టారు. అయితే, ఈ మూవీ ఆదిలోనే ఆగిపోయింది. రణ్‍వీర్, ప్రశాంత్ మధ్య విభేదాలు రావటంతో ఈ చిత్రం రద్దయిపోయింది. హనుమాన్‍కు సీక్వెల్‍గా జైహనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాల్సి ఉంది. తేజ సజ్జాతో ఇంకో సినిమా చేసే ప్లాన్‍లో ఉన్నారు. అయితే, మోక్షజ్ఞతో చిత్రాన్నే ప్రశాంత్ ముందుగా చేయనున్నారు.
టాపిక్