తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Ghost Streaming In Netflix: ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'ఘోస్ట్'.. ఎందులో అంటే?

The Ghost Streaming in Netflix: ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'ఘోస్ట్'.. ఎందులో అంటే?

02 November 2022, 11:23 IST

google News
    • The Ghost Streaming in Netflix: టాలీవుడ్ స్టార్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్.
ది ఘోస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్
ది ఘోస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ (Twitter)

ది ఘోస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్

The Ghost Streaming in Netflix: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ పక్క సినిమాలతో పాటు బిగ్‌బాస్ లాంటి పాపులర్ టీవీ షోతోనూ విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవల నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. మాస్ ప్రేక్షకులను అలరించినప్పటికీ.. మిగిలిన వర్గాల వారికి పెద్దగా రుచించలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసింది చిత్రబృందం.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ది ఘోస్ట్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం(నవంబరు 2) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా.. ఓటీటీలో మాత్రం ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సోనాలి నారంగ్, పుశ్కర్ రామ్ మోహనరావు, శరత్ మారార్ నిర్మించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేసింది. భరత్-సౌరభ్ సంగీతాన్ని సమకూర్చారు. ముకేశ్ జీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

తదుపరి వ్యాసం