Nagarjuna The Ghost First Day Collection: నాగార్జున ది ఘోస్ట్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్-the ghost first day collections nagarjuna film earns 4 60 crore at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna The Ghost First Day Collection: నాగార్జున ది ఘోస్ట్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్

Nagarjuna The Ghost First Day Collection: నాగార్జున ది ఘోస్ట్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్

Nelki Naresh Kumar HT Telugu
Oct 06, 2022 12:04 PM IST

The Ghost First Day Collection: నాగార్జున( Nagarjuna) హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ది ఘోస్ట్ సినిమాకు మొద‌టి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే...

<p>నాగార్జున‌, సోనాల్ చౌహాన్‌</p>
నాగార్జున‌, సోనాల్ చౌహాన్‌ (Twitter)

Nagarjuna The Ghost First Day Collection: ఈ ఏడాది టాలీవుడ్‌లో ద‌స‌రా బాక్సాఫీస్ బ‌రిలో చిరంజీవి, నాగార్జున పోటీప‌డ‌టం ఆస‌క్తిని రేకెత్తించింది. చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌తో పాటు నాగార్జున ది ఘోస్ట్ సినిమా బుధ‌వారం రోజు విడుద‌లైంది. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ది ఘోస్ట్ సినిమాను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించారు.

ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ల‌లో నాగార్జున కొత్త లుక్‌లో క‌నిపించ‌డం, యాక్ష‌న్ సీక్వెన్స్‌, విజువ‌ల్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయ‌డంతో సినిమాపై భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. కానీ యాక్ష‌న్ స్థాయిలో ఎమోష‌న్స్ పండ‌క‌పోవ‌డంతో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది. మొద‌టిరోజు ది ఘోస్ట్ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 4.60 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్డ్ డే ఈ సినిమాకు 3.60 కోట్ల గ్రాస్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

బుధ‌వారం రోజు నైజాంలో 60 ల‌క్ష‌లు, సీడెడ్‌లో 25 ల‌క్ష‌లు, ఈస్ట్ గోదావ‌రిలో 23 ల‌క్ష‌లు, గుంటూర్‌లో 22 ల‌క్ష‌లు, కృష్ణ‌లో 20 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్‌ను ది ఘోస్ట్ సినిమా సాధించిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఏపీ, తెలంగాణ‌లో 3.60 కోట్ల గ్రాస్‌, 2.05 కోట్ల షేర్ రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. ఓవ‌ర్‌సీస్‌లో మొద‌టిరోజు ది ఘోస్ట్ సినిమాకు 25 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఫ‌స్ట్ డే 4.60 కోట్ల గ్రాస్‌, 2.50 కోట్ల షేర్‌ను ది ఘోస్ట్ సినిమా ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 21.50 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. 22 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ వ‌స్తేనే నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు సేఫ్ అవుతారు.

ఈ సినిమాలో ఆవేశ‌ప‌రుడైన ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా నాగార్జున న‌టించాడు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ను కాపాడుకునే క్ర‌మంలో అత‌డికి ఎదురైన అనుభ‌వాల చుట్టూ ఈ క‌థ సాగుతుంది. సోనాల్ చౌహాన్ (Sonal chauhan) హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో గుల్‌ప‌నాగ్‌, అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Whats_app_banner