The Ghost Trailer: 'ఘోస్ట్' వచ్చేశాడు.. దయ చూపనంటున్న నాగ్
30 September 2022, 16:42 IST
- The Ghost Release Trailer: నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. అక్టోబరు 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది.
నాగార్జున ది ఘోస్ట్ ట్రైలర్
goNagarjuna The Ghost Release Trailer: వినూత్న కథలకు పెట్టింది పేరు మన కింగ్ నాగార్జున. సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తూ కొత్త దర్శకులకు కూడా అవకాశం కల్పించే హీరో నాగ్. ఈ ఏడాది ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో మంచి హిట్ అందుకున్న నాగ్.. తాజాగా మరో సరికొత్త కథతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. అదే ది ఘోస్ట్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పాటలు, టీజర్ విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తుంది మూవీ టీమ్. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు విడదలై ఆద్యంతం ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కొత్త ట్రైలర్‌లో సన్నివేశాలు సినిమాలో చాలా కీలకమైనవి తెలుస్తోంది. "డబ్బు.. సక్సెస్, సంతోషం కంటే శత్రువులను ఎక్కువగా సంపాదిస్తుంది" అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇంటర్ పోల్ ఆఫీసర్లుగా వీరిద్దరూ కనిపించనున్నారు. ఓ మెషిన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆపరేషన్ వీరు విజయవంతంగా పూర్తి చేశారా? లేదా అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సోనాలి నారంగ్, పుశ్కర్ రామ్ మోహనరావు, శరత్ మారార్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేస్తోంది. భరత్-సౌరభ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ముకేశ్ జీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
టాపిక్