తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thank You Teaser | థ్యాంక్యూ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పిన చైతూ

Thank You Teaser | థ్యాంక్యూ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పిన చైతూ

HT Telugu Desk HT Telugu

23 May 2022, 20:29 IST

google News
    • Thank You Teaser | నాగచైతన్య నటిస్తున్న సినిమా థ్యాంక్యూ. ఈ సినిమాపై ఓ ఫన్నీ వీడియోతో చైతూ ఓ కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు.
థ్యాంక్యూ మూవీలో నాగచైతన్య
థ్యాంక్యూ మూవీలో నాగచైతన్య (Twitter)

థ్యాంక్యూ మూవీలో నాగచైతన్య

చైతన్య ఫ్యాన్స్‌ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న న్యూస్‌ రానే వచ్చింది. అతని నెక్ట్స్‌ మూవీ థ్యాంక్యూ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను చైతూ చెప్పేశాడు. సోమవారం తన ట్విటర్‌ ద్వారా ఓ ఫన్నీ వీడియోతో ఈ గుడ్‌న్యూస్‌ను వెల్లడించాడు. విక్రమ్‌ కే కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ ఈ నెల 25న సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ చెప్పారు.

దీనికోసం వాళ్లు నాగచైతన్యతో ఓ స్పెషల్‌ వీడియో చేశారు. ఆ వీడియోలో చైతూ డబ్బింగ్‌ చెబుతూ కనిపించాడు. ఏ పనైనా వెంటనే చేయాలి అంటూ సినిమాలో డైలాగ్‌ చెబుతూ.. ఎందుకు తనను వీడియో తీస్తున్నావ్‌ అంటూ పక్కనే ఉన్న కెమెరామ్యాన్‌ను అడుగుతాడు చైతన్య. డబ్బింగ్ రూమ్‌ బయట ఉన్న డైరెక్టర్‌ విక్రమ్‌ను పిలిచి.. ఏంటిది? ఏం జరుగుతోంది అని సరదాగా అడుగుతాడు.

దానికి విక్రమ్‌ స్పందిస్తూ.. సినిమా టీజర్‌ రిలీజ్‌ చేద్దామనుకుంటున్నామని చెప్పగా.. ఏంటీ.. ఈ సినిమానే.. థ్యాంక్యూయేగా అని చైతూ అడగటం వీడియోలో చూడొచ్చు. కచ్చితంగా చేస్తున్నాం కదా.. మరి చెప్పేయమంటావా అని మరోసారి డైరెక్టర్‌ను అడుగుతాడు. ఆ వెంటనే థ్యాంక్యూ టీజర్‌ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

దిల్‌ రాజు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మనం తర్వాత విక్రమ్‌ డైరెక్షన్‌లో చైతన్య చేస్తున్న మూవీ ఇది. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. మనంలాగే ఈ థ్యాంక్యూ మూవీలోనూ ఎమోషనల్‌ సీన్స్‌ చాలానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారంతో ఈ మనం మూవీ రిలీజై కూడా 8 ఏళ్లు అయిన సందర్భంగా అంతకుముందు డైరెక్టర్‌ విక్రమ్‌తో ఓ స్పెషల్‌ పోస్ట్‌ను చైతన్య అభిమానులతో పంచుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల వాళ్లు ఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఏఎన్నార్‌ నటించిన చివరి మూవీ కూడా అదే.

తదుపరి వ్యాసం