Sobhita Dhulipala Naga Chaitanya Wedding: పెళ్లి మండపం నుంచి వధూవరుల ఫస్ట్ ఫొటో బయటికి.. ఎంత ముచ్చటగా ఉన్నారో!
04 December 2024, 20:56 IST
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల బుధవారం రాత్రి వివాహ బంధంతో ఒక్కటి అవుతున్నారు. పరిమిత సంఖ్యలో అతిథులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరుగుతోంది.
శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య
Naga Chaitanya Wedding Ceremony: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో బుధవారం రాత్రి జరుగుతోంది. ఈ వివాహ వేదిక నుంచి ఫస్ట్ ఫొటో బయటికి వచ్చింది. నూతన వధూవరులను చూసిన నెటిజన్లు.. చూడముచ్చటైన జంట అంటూ కితాబిస్తున్నారు.
ఓటీటీకి మ్యారేజ్ రైట్స్
రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈరోజు అతి కొద్ది మంది అతిథులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో వివాహ వేదిక నుంచి ఎక్కువగా ఫొటోలు, వీడియోలు బయటికి రావడం లేదు.
అతిథుల జాబితా పెద్దదే
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి హాజరయ్యే అతిథుల జాబితా చాలా పెద్దదిగానే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలానే దర్శకుడు రాజమౌళి, కొంత మంది హీరోయిన్స్ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఫొటోలు బయటికి రాకపోవడంతో ఇప్పటి వరకూ ఎవరు హాజరయ్యారు అనేది క్లారిటీ రావడం లేదు.